BigTV English

Iteams on Floor: నేల మీద నేరుగా పెట్టకూడదని వస్తువులు..

Iteams on Floor: నేల మీద నేరుగా పెట్టకూడదని వస్తువులు..

Iteams on Floor:హిందూమతంలో భూమిని భూమాతగా..భూదేవిగా కొలుస్తాం. మనం ఎన్ని తప్పులు చేసినా సహిస్తూ ఉంటుంది. కాబట్టి తల్లిగా పోల్చుతాం. భూదేవంత సహనం తల్లికే ఉంటుంది. ఏం చేసినా సహిస్తుంది. భూమికి ఉన్న గుణం దేనైనా ఆకర్షిస్తుంది. అదే గురుత్వాకర్షణ శక్తి. విశ్వంలో ఒక కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చెట్టు ఎంత ఎత్తుకి వెళ్లినా దాన్ని వేళ్లు భూమి లోపలే ఉంటాయి. భూమి మీద ఉన్న ప్రతీ వస్తువూ భూమి మీద పుట్టిందే. మన భూమి గర్బంలోనే ఉన్నా. కాబట్టి మనం చేసినా ఈ నేల మీద చేయాల్సిందే.కొన్ని వస్తువులు నేల మీద పెట్టకూడదని అంటారు . కానీ ఈ సిద్ధాంతం ప్రకారం అందులో ఎలాంటి తప్పు ఉండదని వాస్తునిపుణులు చెబుతున్నారు.


కానీ ఒక్క విషయం ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుంది. ఒక చెంబుడు నీళ్లు నేల మీద పోస్తే అది బురదగా మారి మన మీద పడుతుంది.అందుకే దేవుడి నైవేద్యం పెట్టేటప్పుడు నేరుగా భూమి మీద పెట్టకూడదు. పత్రంలో కానీ పళ్లెంలో కానీ పెట్టాలి. అవన్నీ భూమి మీద నుంచి వచ్చినవే..మళ్లీ భూమిలోకి పోతాయి. ఆ సారం కూడా భూమి లాక్కుంటుంది. కాబట్టి నైవేద్యాన్ని నేరుగా నేలపై పెట్టకుండా పళ్లెంలోనైనా పెట్టాలి.

నగలు భూమి మీద పారేయకూడదు. దానిలోని కాంతిని భూమి లాగేస్తుంది. అల్మరా తాళాలు కూడా విసిరేయకూడదు. అలా చేస్తే అది దరిద్ర హేతువుగా మారుతుంది. మురిపింగా మనం చూసుకునే వస్తువు ఏదీ నేలపైన పారేయకూడదు. చాప కాని దుప్పటి మీద కాని వేసుకోవాలి. అలాగే ఎలాంటివారైనా సరే ఆయుధాలు భూమి మీద పెట్టకూడదు. ఎత్తి పట్టుకోవాలి. ఇప్పటి ఆయుధాలు పక్కన పెితే గతంలో ఉండే ఆయుధాలేవీ భూమి మీద పెట్టేవారు కాదు. పూర్వం రాజుల కాలంలో కూడా కత్తులు లాంటివి కిందపెట్టే వారు కాదు. వేలాడదీయడమో ఇంకోటో చేసేవారు. రాముడు, అర్జునుడు లాంటి వారు కూడా వారి ధనస్సును భూమి మీద పెట్టలేదు.


జపమాలలు ఏవీ భూమి మీద పెట్టకూడదు. జపమాలను నిత్యం ధరిస్త్తూ ధ్యానిస్తూ ఉంటారు కాబట్టిలో ఒక రకమైన శక్తి తయారవుతుంది. కాబట్టి ఆ జపమాలను భూమి మీద పెడితే దాంట్లోని శక్తిని లాగేస్తుంది. మీరు గమనిస్తే భూమి మీద కూర్చుని ఎవరూ జపం చేయరు. కింద ఏదో ఒకటి ఆసనంగా వేసుకుంటారు. భూమి మీద నేరుగా కూర్చోకూడదు. దీక్షా సమయాల్లో తప్ప మిగతా ఏసమయాల్లోను కటిక నేలపై పడుకోరాదు. వైద్య సమస్యల వల్ల కొంతమంది నేలపై పడుకుంటారు. అది ఈ లెక్కలోకి రాదు.

Tags

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×