E-Paper
Advertisement

Balayya: బాలయ్య బాబు కాదు ‘బాలయ్య తాత’.. జగన్ మీద పంచ్ డైలాగులకేనా కౌంటర్లు?

Balayya: బాలయ్య బాబు కాదు ‘బాలయ్య తాత’.. జగన్ మీద పంచ్ డైలాగులకేనా కౌంటర్లు?
Advertisement

Balayya: వీరసింహారెడ్డి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. బాలయ్య జోష్ అన్ స్టాపబుల్. ఒంగోలు హోరెత్తిపోయింది. వీరసింహారెడ్డి డైలాగులతో కేక పెట్టింది. ట్రైలర్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి పందెంకోడిలా బాక్సాఫీస్ రికార్డులు వేటాడేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య బాబు.

బాలయ్య జోరకు చాలామంది హ్యాపీగా ఉన్నా.. వైసీపీ మాత్రం లోలోన రగిలిపోతోంది. వీరసింహారెడ్డి ట్రైలర్ లో జగన్ సర్కారును కార్నర్ చేసేలా కొన్ని డైలాగులు ఉన్నాయనేది వారి ఆగ్రహానికి కారణం. “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు..మార్చలేదు”.. ఈ డైలాగ్ తో బాలయ్య ఇన్ డైరెక్ట్‌గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటి పేరు మార్పుపై ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారంటున్నారు. ఇక, “పదవి చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏ కే పొగరెక్కువా”.. ఈ డైలాగ్ కూడా పరోక్షంగా జగన్ ను ఉద్దేశించేననే ప్రచారం జరుగుతుండటంతో వీరసింహారెడ్డిపై వైసీపీ నేతలు రివర్స్ పంచ్ లు విసురుతున్నారు.

Advertisement

మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి బాలయ్య బాబుపై సెటైర్లు వేశారు. ఆయన బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత అంటూ ఎద్దేవా చేశారు. బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని.. ఆయనను చూడటానికి ఇప్పుడు ఎవరు వస్తారని ఎగతాళి చేశారు. వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుకున్నంత జనం రాలేదన్నారు. బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి కాదని.. ఇప్పుడాయన వీరసింహారెడ్డి అంటూ దెప్పిపొడిచారు. జనాలు లేకే చంద్రబాబు, బాలయ్య రోడ్లపై మీటింగ్‌లు పెడుతున్నారని.. పల్లీలు, కాయగూరలు కొనడానికి వచ్చిన వారితో మీటింగ్‌లు పెట్టి జనాలను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు.

అదేదో సినిమా ఫంక్షన్. అందులో ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు. జస్ట్.. వీరసింహారెడ్డిని ప్రమోట్ చేసుకున్నారంతే. మరి, ఆ ఈవెంట్ పై ఏకంగా మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఏముంది? అంటే, ట్రైలర్ లోని డైలాగులు వారిని ఇబ్బంది పెడుతున్నాయని.. అందుకే ఇలా ఉలిక్కిపడుతున్నారని.. బాలయ్య బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్య.. వయసులో తాత కావొచ్చు కానీ.. ఆయనది పసిపిల్లలలాంటి మనస్సు అని సమర్థించుకుంటున్నారు. మా బాలయ్య బాబు.. మాకు ఎప్పుడు బాబునే అంటూ.. జై బాలయ్య అంటున్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×