E-Paper
Advertisement

Jupiter Atmosphere : జూపిటర్ వాతావరణంపై ఆస్ట్రానాట్స్ దృష్టి..

Jupiter Atmosphere : జూపిటర్ వాతావరణంపై ఆస్ట్రానాట్స్ దృష్టి..
Advertisement

Jupiter Atmosphere : అంతరిక్షంలోని అన్ని గ్రహాల గురించి, నక్షత్రాల గురించి.. ఇప్పటివరకు ఆస్ట్రానాట్స్ తెలుసుకోలేని ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడం కోసమే నాసా అనేది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది తయారు చేసింది. ఇప్పటికే ఇతర టెలిస్కోప్‌లు సాధించలేని, కనిపెట్టలేని ఎన్నో కొత్త విషయాలను.. ఈ వెబ్ టెలిస్కోప్ బయటపెట్టింది. తాజాగా జూపిటర్‌పై ఈ టెలిస్కోప్ ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. జూపిటర్‌పై వాతావరణాన్ని కనిపెట్టడంలో ఆస్ట్రానాట్స్‌కు సాయం చేయనుంది.

ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ ద్వారా అంతరిక్షం లోతుల్లో చూడడానికి ఈ టెలిస్కోప్ ఉపయోగపడనుంది. దీని ద్వారా ఎంతోమంది సీనియర్, జూనియర్ ఆస్ట్రానాట్స్ ఎన్నో ఘనతలను సాధించారు. తాజాగా నార్తంబ్రియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కూడా జూపిటర్‌పై వాతావరణాన్ని తెలుసుకోవడం కోసం దీనిని ఉపయోగించనున్నారు. ఇప్పటికే ఈ టెలిస్కోప్‌ను ఉపయోగించే అవకాశం కోసం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పోటీ ఉంది. జూపిటర్‌పై వాతావరణాన్ని తెలుసుకోవడం ఆసక్తికర విషయం కాబట్టి ఈ టెలిస్కోప్ సాయంతో దానిని కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

ప్రస్తుతం సోలార్ సిస్టమ్‌లో ఉన్న ఏ గ్రహాన్ని స్టడీ చేయడానికి కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆచరణలో లేదు. ఇదే సమయంలో జూపిటర్ గురించి తెలుసుకోవాలని పలువురు శాస్త్రవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగా జూపిటర్‌లోని పైభాగం అంతరిక్ష వాతావరణం వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని తెలుసుకొని ఆపై జూపిటర్ లోపల భాగం యొక్క వాతావరణాన్ని తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. జూపిటర్‌పైన లేయర్‌ను ఐనోస్పియర్ అంటారని వారు తెలిపారు.

ఐనోస్పియర్ లేయర్ అనేది అంతరిక్షంలో పెద్ద పెద్ద సిస్టమ్స్ వల్ల ప్రభావితం అవుతుంటుంది. కింద నుండి ఎనర్జీ వస్తుండడం, పైన ఉన్న జూపిటర్ మూన్స్‌లో జరిగే అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే గాలులు.. ఇవన్నీ జూపిటర్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే జూపిటర్ పోల్స్‌కు సంబంధించి సమాచారం శాస్త్రవేత్తల వద్ద ఉన్నా.. దాని వాతావరణం గురించి పూర్తిస్థాయిలో స్టడీ చేసే అవకాశం మాత్రం వారికి రాలేదు. అంతే స్టడీ జరుగుతున్న సమయంలో వారికి ఎదురయ్యే ఆసక్తికర సమాచారాన్ని బయటపెడతామంటున్నారు శాస్త్రవేత్తలు.

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×