Wasim Akram On IND VS PAK: పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠ గా జనాలు చూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు తలపడితే కోట్ల వర్షం కురవడం ఖాయం. అటు వ్యూయర్ షిప్ కూడా రికార్డ్ స్థాయిలో నమోదు కావడం గ్యారెంటీ. అయితే అలాంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లపై మాజీ ఆటగాడు వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియా పై పాకిస్తాన్ దే పై చేయి అంటూ బాంబు పేల్చారు. గతంలో ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా, ఇండియాను పాకిస్తాన్ ఓడించేదని గుర్తు చేశారు. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయిందని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పటికీ ఎప్పటికీ వన్డేల్లో మాత్రం పాకిస్తాన్ టాప్ లో ఉంటుందని వివరించారు. దీంతో వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ప్రపంచ కప్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ పై టీమిండియా డామినేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వసీం అక్రమ్. ప్రపంచ కప్ టోర్నమెంట్ లో 8 మ్యాచ్ లు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగితే… అన్నింటిలో పాకిస్తాన్ ఓడిపోవడం చాలా బాధాకరం అన్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించారు. ఈ రికార్డు తనని చాలా బాధ కలిగిస్తుందని ఎమోషనల్ అయ్యారు. ప్రతి వరల్డ్ కప్ ముగిశాక అయ్యో ఆ మ్యాచ్ మనం గెలిచి ఉండాల్సింది అనే వెలితి గుండెల్లో ఎక్కడో ఒకచోట ఉండిపోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ భవిష్యత్తులో పాకిస్తాన్ మళ్లీ విజయాల బాట పడుతుందన్నారు. ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ జరిగినా మాదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు వసీం అక్రమ్.
వన్డే క్రికెట్ లో ఇప్పటికీ పాకిస్తాన్ దే టీమిండియా పైన పై చేయి సాధించిందని వసీం అక్రమ్ వెల్లడించారు. 1978 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 136 మ్యాచులు జరిగినట్లు గుర్తు చేశారు. అయితే ఇందులో పాకిస్తాన్ 73 విజయాలు సాధించిందని తెలిపారు. కానీ టీమిండియా కేవలం 58 మ్యాచ్ లలో గెలవడం.. పాకిస్తాన్ గౌరవాన్ని పెంచుతుందని వ్యాఖ్యానించారు. కానీ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ దారుణంగా ఓటమి పాలు అవుతోందని బాధపడ్డారు.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవ్వాళ కూడా పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరగనున్నట్లు గుర్తు చేశారు. ఇందులో పాకిస్తాన్ జట్టుకు గెలిచే అవకాశాలు ఉన్నాయని.. కెప్టెన్ ఫాతిమా జట్టును ముందుండి నడిపించాలని కోరారు. ఆమె గనుక చేతులెత్తేస్తే మ్యాచ్ పోవడం పక్క అంటూ హెచ్చరించారు.