E-Paper
Advertisement

Kasi : కాశీకి వెళ్లొస్తే కాయో, పండో వదిలేయాలా..దానర్థం ఇదేనా!

Kasi : కాశీకి వెళ్లొస్తే కాయో, పండో వదిలేయాలా..దానర్థం ఇదేనా!
Advertisement

Kasi : కాశీ ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రం.హిందూమతంలో పుట్టిన ప్రతీ ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రాంతమని మన పెద్దలు చెబుతుంటారు. చనిపోయినవాళ్ల అస్థికలు కలపడానికి విధిగా అక్కడగా వెళ్లే వారు ఉంటారు. అలాంటి పద్దతి లేని వాళ్లు ఉంటారు. ఏ కారణం చేతనైనా కాశీకి వెళ్తే కాయో, పండో వదిలేయాలని చెప్పడం వింటుంటాం. అంటే కాయో పండో అంటే తినే కాయలు, పళ్లు కాదు.

కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి కాయాపేక్ష, ఫలాపేక్షను వదిలేసి విశ్వనాథుడి దర్శనం చేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వెళ్లాలని అంతరార్థం. కాయపేక్ష అంటే శరీరానికి అపేక్షమైనవని అర్ధం. శరీరంపై మమకారం ఉంచుకోవదని పరమార్థం. ఆ మమకారాన్ని వదిలియేమని కాశీ యాత్ర చెబుతోంది. కాశీలాంటిపుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు నువ్వు కోరికలను వదిలేయమని శాస్త్రం చెబుతోంది. ఫలాపేక్ష అంటే ప్రతిఫల ఆపేక్షను వదిలేయమని అర్ధం.

Advertisement

కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. కాలక్రమేణా అది కాస్తా కాయ, పండుగా మారిపోయింది. అంతే కానీ, కాశీకి వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఏమీ ఉండదు. శాస్త్రం నిజంగా ఎలా చెబుతుందో అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. జీవిత చరమాంకంలో బంధాలు, రాగ ద్వేషాలు, తోటి వారితో వివాదాలు వదిలి మృత్యువు దరి చేరే వరకూ మనసును ఈశ్వరుడిపై లగ్నం చేయాలి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×