Big Stories

Korala Pournami : కోరల పౌర్ణమి నాడు కుక్కలకు కుడుములు పెట్టాలా..?

Korala Pournami : పాప పుణ్యాల ఫలితాలే స్వర్గనరకాల ప్రవేశాలకు కారణం. తెలిసి చేసినా తెలియక చేసినా జన్మజన్మల పాటు వెంటాడుతుంది. పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవుడుపడే యాతన అంతా ఇంతా కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యు భయం లేకుండా ఉండాలంటే … నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని చెప్పబడుతోంది. అందరి ప్రార్ధనలను యముడు ఆలకించి అనుగ్రహించే రోజే మార్గశిర పౌర్ణమి. దీనినే కోరల పున్నమి అని కూడా అంటారు. ఈ పున్నమి యమధర్మరాజుకి ఎంతో ప్రీతికరమైనదట. ఈ రోజున పూజించడం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. యమధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావడం వల్ల నరక పౌర్ణమి గా కూడా భావిస్తుంటారు.

- Advertisement -

కోరల పౌర్ణమి నాడు పూజచేస్తే అనేక వ్యాధుల నుంచి విముక్త కలిగింది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం. పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కోరల పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు. చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికీ నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది.

- Advertisement -

కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారుచేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్ర వ్రతం చేయాలనీ పురాణాలు చెపుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News