Qualities in Boys: అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చాలంటే.. ఎలాంటి లక్షణాలు ఉండాలి అని ఎవర్నైనా అడిగితే? వెంటనే వారి నుంచి వచ్చే సమాధానం ‘డబ్బున్న అబ్బాయిలనే ఇష్టపడతారు’ అని. అయితే, ఈ అభిప్రాయం తప్పని చెబుతున్నారు సైకాలజిస్టులు. ఈ విషయంపై ఆస్ట్రేలియాలోని ఓ యూనివర్సిటీ చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే.. డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు మించి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మగవారిలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో అమ్మాయిలకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మగవారితో అమ్మాయిలు ఎక్కువకాలం రిలేషన్‌షిప్‌లో ఉండాలంటే.. వారిలో నిజాయితీ, నమ్మకం ఉండాలి. ఒక రిలేషన్‌షిప్‌లో అత్యంత ముఖ్యమైన పునాది నిజాయితీ. అబ్బాయిలు ఏ విషయంలోనైనా నిజాయితీగా ఉంటే.. అమ్మవాయిలు వారిని గట్టిగా నమ్ముతారు. దీంతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే, చిన్న అబద్ధాలు కూడా చెప్పని వారిని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ నిజాయితీ, నమ్మకం వారికి భద్రతా భావాన్ని కలిగిస్తాయట.
ఆడవారి అభిప్రాయాలను, కుటుంబ సభ్యులను, వారి స్నేహితులను గౌరవించే మగవాళ్లకు అమ్మాయిలు ఎక్కువగా ఇంప్రెస్ అవుతుంటారు. అమ్మాయిల ఆలోచనలకు విలువ ఇస్తూ.. సమానంగా చూసే గుణం మగవారిలో ఉంటే అమ్మాయిలు ఫస్ట్‌సైట్‌లోనే ప్రేమలో పడిపోతారు.
సెన్సాఫ్ హ్యూమర్ కలిగి ఉండే.. పురుషులకు అమ్మాయిలు బాగా ఆకర్షితులవుతారు. ఎందుకు ఇష్టపడతారంటే.. ఫన్నీగా ఉండటం, క్రియేటివ్‌గా ఆలోచించడం, సరైన సమయంలో సరదాగా మాట్లాడి నవ్వించే గుణం ఉండే మగవారిని ఆడవాళ్లు ఇష్టపడతారట. క్లిష్ట పరిస్థితుల్లో కూడా హాస్యంతో వాటిని ఎదుర్కొనే వారిపట్ల ప్రత్యేక గౌరవం కలుగుతుంది.
ఆమె కష్టాలను, బాధలను అర్థం చేసుకునే అబ్బాయి పట్ల స్త్రీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతుంది. రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఈ లక్షణం చాలా ముఖ్యమని అమ్మాయి భావిస్తుంది. కోపం, చిరాకు, నిరాశకు లోనవ్వకుండా ఉండగలగడమే ఈ గుణానికి ప్రత్యేకత.
బాధ్యత గలిగిన అబ్బాయిలు అనుక్షణం కంటికి రెప్పలా కాచుకుంటారని, వారి దగ్గర కంఫర్ట్‌గా ఉండవచ్చనే భావన అమ్మాయిల్లో కలుగుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం కలిగిన అబ్బాయిల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వారు గట్టిగా నమ్ముతారు. దీంతో పాటు ఎప్పుడూ నవ్వుతూ ఉండే అబ్బాయిలను చూసినా అమ్మాయిలు ఇట్టే ఇంప్రెస్ అవుతారట. ఈ లక్షణాలన్నీ ఉన్న అబ్బాయిల వెంట వద్దన్నా వెంటపడతారట అమ్మాయిలు!