Ice Cubes For Burnt Pans: వంట చేసిన తర్వాత అడుగున మాడిపోయిన.. లేదా జిడ్డు పట్టిన పాత్రలను శుభ్రం చేయడం అనేది ఒక పెద్ద సవాలు. ఎంత రుద్దినా కూడా కొన్ని సార్లు మాడిన మరకలు వదలక చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే.. ఈ సమస్యకు మీ ఫ్రీజర్‌లో ఉండే ఐస్ క్యూబ్స్ ఒక అద్భుతమైన, సులభమైన పరిష్కారాన్ని అందిస్తాయని మీకు తెలుసా ? అవును ‘ఐస్ క్యూబ్ హ్యాక్’ కేవలం జిడ్డును వదలగొట్టడానికే కాకుండా.. పాత్రలలో పేరుకుపోయిన మాడిన పదార్థాన్ని సులభంగా తొలగించడానికి కూడా ఉపయోగపడతాయి. ఐస్ క్యూబ్స్‌తో పాత్రలపై ఉన్న మరకలు ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ క్యూబ్స్ ఎలా పని చేస్తాయి ?
1. మరకలను గట్టిపరచడం: జిడ్డు పట్టిన పాత్రపై ఐస్ క్యూబ్స్‌ను వేసినప్పుడు.. ఆ జిడ్డు త్వరగా చల్లబడి, మళ్లీ ద్రవ రూపంలోకి మారకుండా గట్టిగా.. ఘన రూపంలోకి మారుతుంది.
గట్టిపడిన జిడ్డును రుద్దడం సులభం అవుతుంది. సాధారణంగా.. వేడిగా ఉండే జిడ్డు మరింత అంటుకుంటుంది. కానీ చల్లారినప్పుడు అది పాత్ర ఉపరితలం నుంచి తేలికగా వేరుపడుతుంది.
2. మాడిన పదార్థాలు:
మాడిన పాత్రలను వేడి చేసిన తర్వాత అందులో వెంటనే.. చల్లని ఐస్ క్యూబ్స్‌ను వేయాలి. ఈ ఉష్ణోగ్రత మార్పు వల్ల లోహ పాత్ర, అడుగున అంటుకున్న మాడిన పదార్థం పొర సంకోచిస్తుంది. దీని ఫలితంగా.. మాడిన పొర పాత్ర ఉపరితలం నుంచి తేలికగా విడిపోతుంది. దానిని స్క్రేపర్ లేదా స్పాంజ్‌తో సులభంగా తొలగించవచ్చు.
ఐస్ క్యూబ్ ట్రిక్ ను ఉపయోగించే విధానం:
జిడ్డు లేదా మాడిన పాత్రలను శుభ్రం చేయడానికి ఈ ట్రిక్‌ను ప్రయత్నించండి.
Also Read: ఆరోగ్యంగా ఉండాలా ? అయితే.. ఈ పిండితో చేసిన వంటకాలు తినడం మానేయండి
ఐస్, ఉప్పు: పాత్రలోని అదనపు నూనె లేదా వంట పదార్థాలను తీసివేయండి. పాత్ర కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు, అందులో ఒక గుప్పెడు ఐస్ క్యూబ్స్‌ను, ఒక చెంచా ఉప్పును వేయండి. ఉప్పు రాపిడికి సహాయ పడుతుంది.
రుద్దడం: ఐస్ క్యూబ్స్ కరిగేలోపు, ఒక స్పాంజ్ లేదా స్క్రబ్బర్ సహాయంతో.. వెంటనే ఆ జిడ్డు పట్టిన ప్రాంతాన్ని రుద్దడం ప్రారంభించండి. ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల జిడ్డు గట్టిపడి సులభంగా తొలగిపోతుంది.
మాడిన పాత్రలపై నీరు: మాడిన పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయండి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు నీళ్లు తీసేసి.. ఐస్ క్యూబ్స్ వేయండి. రెండు నిమిషాలు ఆగి, గట్టి స్పాంజ్‌తో రుద్దండి. మాడిన పదార్థం పొరలాగా విడిపోవడం గమనించవచ్చు.
సాధారణ శుభ్రత: చివరగా.. పాత్రను ఎప్పటిలాగే డిష్ వాషింగ్ సోప్, వేడి నీటితో కడిగి శుభ్రం చేసుకోండి.
ఈ పద్ధతి సహజమైనది, సులభమైనది. అంతే కాకుండా ఎలాంటి సబ్బులు, లిక్విడ్స్ వంటివి లేకుండా మీ పాత్రలను మెరిసేలా చేస్తుంది.