E-Paper
Advertisement

Krittika Deepotsava : కృత్తిక దీపోత్సవాన్ని అందుకే నిర్వహిస్తారు

Krittika Deepotsava : కృత్తిక దీపోత్సవాన్ని అందుకే నిర్వహిస్తారు
Advertisement

Krittika Deepotsava : తిరుపతి కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రం సందర్భంగా కృత్తికా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపై దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు.

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏటా నిర్వహించే కృత్తికా దీపోత్సవానికి బుధవారం సాయంత్రం సంప్రదాయబద్దంగా అంకురార్పణ చేశారు. ముందుగా మేళతాళాలతో గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూనా కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం ఉదయం కృత్తికా దీపోత్సవం సమయాన శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక స్నపనం నిర్వహించనున్నారు. రాత్రి పోలీసు శాఖ తరపున కృత్తికా దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు.

Advertisement

ఇంట కార్తీకదీపం పెడితే కార్తీకపౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రంనాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షలమంది వస్తారు. ఆ రోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే ఉండదిక. మొత్తం జనంతో నిండిపొతుంది. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. సంవత్సరంలో దీపం వెలిగించకుండా రోజు ఉండకూడదు. అందుకే కార్తీక మాసంలో 365 దీపాలు వెలిగిస్తారు. అలాగే దేవాలయంలోను కృత్తిక దీపాత్సవాన్ని కృత్తిక నక్షత్రం రోజున నిర్వహిస్తారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×