BigTV English
Advertisement

Sprouted Garlic : మొల‌కెత్తిన వెల్లుల్లి తింటే ఏమవుతుంది?

Sprouted Garlic : మొల‌కెత్తిన వెల్లుల్లి తింటే ఏమవుతుంది?

Sprouted Garlic : వెల్లుల్లిలో ఆరోగ్యాన్ని అందించే ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. అయితే వెల్లుల్లిని నేరుగా తిన‌డం కంటే మొల‌కెత్తించి తింటే రెట్టింపు లాభాలు కలుగుతాయి. వెల్లుల్లిని మొల‌కెత్తించ‌డానికి క‌ప్పు లేదా గ్లాస్‌లో దాని పైభాగం వ‌ర‌కు నీటిని నింపాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బ లేదా పూర్తి వెల్లుల్లి తీసుకుని దానికి మూడు పక్కలా టూత్‌పిక్‌లను గుచ్చాలి. ఆ తర్వాత టూత్‌పిక్‌ల సాయంతో వెల్లుల్లిపాయల‌‌ను క‌ప్పు పైభాగంలో ఉంచాలి. అయితే వెల్లుల్లి కింద ఉండే వేర్ల వ‌ర‌కు మాత్రమే నీటిలో మునిగేలా వెల్లుల్లిని ఉంచాలి. 5 రోజుల తర్వాత ఆ వెల్లుల్లి పాయ‌లు మొల‌కెత్తుతాయి. ఆ వెల్లుల్లిని ఉంచే క‌ప్పు లేదా గ్లాస్‌ల‌ను కిటికీల దగ్గర, సూర్యర‌శ్మి త‌గిలే ప్రాంతాల్లో పెట్టాలి. అలా చేస్తే మొల‌క‌లు బాగా వ‌స్తాయి. త‌రువాత వాటిని నేరుగా తీసుకోవ‌చ్చు. లేదా ఆహారంలో క‌లిపి వాడుకోవచ్చు. మొల‌కెత్తిన వెల్లుల్లిలో సాధారణ వెల్లుల్లి కంటే ఎక్కువ‌గా యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. మెటాబొలెట్స్ కూడా అధికంగానే ఉంటాయి. వీటిని తింటే మ‌న‌కు ప‌లు ర‌కాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు న‌యం అవుతాయి. మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల్ని తింటే రక్త నాళాల్లో పేరుకున్న కొవ్వు క‌రుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగుప‌డి గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. మొల‌కెత్తుతున్న వెల్లుల్లిపాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్‌ క‌ణాల‌ను వృద్ధి చెంద‌కుండా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే ముడ‌త‌లు పోయి చ‌ర్మం య‌వ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. మొల‌కెత్తిన వెల్లుల్లి తినడం వల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చిన్నారుల‌కు తినిపిస్తే బుద్ధి పెరుగుతుంది. నాడులలు ఉత్తేజం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×