Spirit: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నోటిలను ఇన్స్పైర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి (megastar Chiranjeevi) . కేవలం నటులను మాత్రమే ఇన్స్పైర్ చేయడం కాకుండా ఎంతో మంది దర్శకులు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని కలలు కన్నారు. అయితే ఆ కలలు అందరికీ నిజం అవ్వవు. అందరికీ మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వంటి దర్శకులు ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని ఎదురు చూశారు. పూరి జగన్నాథ్ తో 5 సార్లు సినిమా మొదలై ఆగిపోయింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను ఏకంగా మెగాస్టార్ చిరంజీవి వినయ విధేయ రామ ఆడియో లాంచ్ లో అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఇది జరగలేదు. అయితే సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన అభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో సందీప్ రెడ్డివంగా చెప్పారు. సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తే చూడాలని చాలామందికి ఆత్రుతగా ఉంది. ఇప్పుడు అదే జరగబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం వినిపిస్తుంది.
కేవలం తెలుగులోనే కాకుండా ఏకంగా ఇండియాలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్‌కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వార్తలు వస్తున్నాయి. దీని గురించి త్వరలోనే అధికారక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
అప్పట్లో మల్టీ స్టార్ సినిమాలో వచ్చేవి, మళ్లీ శ్రీకాంత్ అడ్డాలో దర్శకత్వంలో వచ్చిన సీతమ్మవాకిట్లో సినిమా నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఇప్పటికీ కూడా మల్టీ స్టార్ సినిమాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సాధించింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో మెగాస్టార్ చిరంజీవి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్నారు అంటే ఇది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా అని చెప్పాలి.
అనిమల్ సినిమా చూసినప్పుడు తండ్రి క్యారెక్టర్ ను సందీప్ డిజైన్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. కొంతమంది ఇదే సినిమా రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవితో తీసి ఉంటే ఎలా ఉంటుందో అని ఎడిట్స్ కూడా చేశారు. రామ్ చరణ్ కి తండ్రిగా కాకపోయినా ప్రభాస్ కి మాత్రం తండ్రిగా మెగాస్టార్ ని సెట్ చేశాడు వంగ. ఈ వార్త నిజం అయితే, అసలు అలా ఎలా ఒప్పించావు వంగ అనే కామెంట్స్ వినిపించడం ఖాయం.
Also Read: Saraswati : డైరెక్టర్ గా మారిన ప్రముఖ నటి, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు