BigTV English

Money Plant : మనీ ప్లాంట్ లో పచ్చి పాలు పోస్తే కాసుల వర్షమేనా ?

Money Plant : మనీ ప్లాంట్ లో పచ్చి పాలు పోస్తే కాసుల వర్షమేనా ?

Money Plant : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిది. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే లక్ష్మీ దేవి వస్తుంది. ధన నష్టం వంటి ఇబ్బందులు కలగవు. ఒకవేళ కనుక మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదు అంటే శుక్రవారం నాడు మనీ ప్లాంట్ తీసుకు రావడం వలన ధనం పెరుగుతుంది. లక్ష్మీ దేవిని శుక్రవారం నాడు పూజించడం వల్ల కూడా మీ ఇంట్లో ధనం పెరుగుతుంది. పచ్చి పాలని మనీ ప్లాంట్ మొక్కలో వేస్తే కూడా ధనం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవు. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది మనీ ప్లాంట్ ని నాటినప్పుడు మీరు గాజు సీసా లో వేస్తే మంచిది.


మనీ ప్లాంట్ అదృష్టం, సంపద శ్రేయస్సుతో పాటు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది, మనీ ప్లాంట్‌ను బెడ్‌రూమ్‌లో ఉంచడం వల్ల మీ మానసిక స్థితి మరియు ఉత్సాహం పెరుగుతాయి. ఒత్తిడితో కూడిన రోజు తర్వాత మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనీ ప్లాంట్ ఇండోర్ తేమ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది, ఉష్ణోగ్రతని మెరుగుపరుస్తుంది కూడా.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఉత్తరం దిక్కు కుబేరునికి చెందుతుంది. అందువల్ల, మనీ ప్లాంట్‌ను నీలిరంగు సీసాలో ఉత్తరం వైపు ఉంచడం వల్ల సంపద కలుగుతుంది. లాప్ టాప్, కంప్యూటర్స్, మొబైల్ స్క్రీన్ ఎక్కువగా ఉపయోగించుకునే చోట ఈ ప్లాంట్ ను పెంచుకుంటే వాటి నుంచి వెలువడే రేడియేషన్ బారి నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌కు విపరీతమైన ప్రాముఖ్యత ఉంది. ఇది మీ సృజనాత్మకతను మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గించి ఉత్సాహాన్ని పెంచుతుంది


Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×