BigTV English

Musk: ఆదాయ మార్గాలపై మస్క్ నిత్యాన్వేషణ

Musk: ఆదాయ మార్గాలపై మస్క్ నిత్యాన్వేషణ

Musk:ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానంలో ఉండి… 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్‌ను కొన్న తర్వాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ ఎలాన్ మస్క్… సంస్థ ఆదాయం ఎలా పెంచుకోవాలా? అని అనుక్షణం ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే ట్విట్టర్ బ్లూ టిక్ కోసం ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి సబ్ స్రిప్షన్ ఛార్జీలు వసూలు చేస్తున్నా… ప్రకటనలు భారీగా తగ్గిపోవడంతో… మస్క్ ఆశించిన మేరకు ట్విట్టర్‌కు ఆదాయం రావడం లేదు. దాంతో కనీసం కంపెనీ భవనాల అద్దెను కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో… సరికొత్త ఆదాయ మార్గాల కోసం మస్క్ నిత్యం వెతుకుతున్నాడు.


తాజాగా ట్విట్టర్లో పేమెంట్ ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాడు… మస్క్. దీనికి సంబంధించిన లైసెన్స్‌ కోసం కూడా మస్క్ దరఖాస్తు చేశాడని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ వార్తలపై ట్విట్టర్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. పేమెంట్ ఫీచర్‌కు లైసెన్స్ వస్తే… లావాదేవీల ద్వారా కాస్తోకూస్తో ఆదాయం వస్తుందని మస్క్ భావిస్తున్నాడు. సోషల్ నెట్‌వర్కింగ్, చెల్లింపులు, ఇ-కామర్స్ షాపింగ్‌లను అందించే ‘ఎవ్రీథింగ్‌’ యాప్‌గా ట్విట్టర్‌ను సరికొత్తగా ఆవిష్కరించాలనే ఆలోచన ఉందని మస్క్‌ గతంలోనే చెప్పాడు. అందులో భాగంగానే పేమెంట్ ఫీచర్ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే… ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి రాకముందే… 2021లో ఫాలోవర్ల నుంచి డిజిటల్‌ రూపంలో టిప్స్‌ తీసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

ట్విట్టర్ కొనుగోలు కోసం, ఆ సంస్థను నడిపించడం కోసం మస్క్ భారీగా టెస్లా షేర్లను అమ్మేయడంతో… ఆయన సంపద భారీగా తగ్గిపోయింది. ఒకప్పుడు 320 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా వెలిగిన మస్క్… ట్విట్టర్ కొన్నాక దాదాపు సగం సంపద కోల్పోయాడు. ప్రస్తుతం 174 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు… మస్క్. తొలి స్థానంలో 214 బిలియన్ డాలర్ల సంపదంతో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నార్డ్ ఉన్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×