BigTV English

Gill Creates New Record:’గిల్‌’క్కొట్టుడుకు T20ల్లోనూ రికార్డులు బద్దలు

Gill Creates New Record:’గిల్‌’క్కొట్టుడుకు T20ల్లోనూ రికార్డులు బద్దలు

Gill Creates New Record:న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన టీమిండియా విధ్వంసకర బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌… అనేక రికార్డుల్ని తిరగరాశాడు. ఇటీవలే వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత చిన్న వయసు ఆటగాడిగా రికార్డులకెక్కిన గిల్… ఇప్పుడు టీ-20ల్లోనూ సెంచరీ కొట్టిన పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు… న్యూజిలాండ్‌పై టీమిండియా తరఫున వన్డేలు, టీ-20ల్లో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగానూ గిల్‌ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌పై వన్డేలో 208 రన్స్ చేసిన గిల్… టీ-20లో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ-20ల్లో టీమిండియా తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా కూడా గిల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 122 పరుగులు చేసి… టీమిండియా తరఫున టీ-20ల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సాధించాడు. ఇప్పుడు 126 పరుగులతో గిల్ దాన్ని అధిగమించాడు.


న్యూజిలాండ్‌పై అర్థ సెంచరీ పూర్తి చేసేందుకు 35 బంతులు ఆడిన గిల్‌… సెంచరీని అందుకోవడానికి మరో 19 బంతులు మాత్రమే ఆడాడు. ఇది కూడా ఓ రికార్డే. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా, ఈ ఫీట్‌ సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా 23 ఏళ్ల గిల్‌ రికార్డుల్లోకెక్కాడు. గిల్ కన్నా ముందు సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, కె.ఎల్‌.రాహుల్‌, విరాట్‌ కోహ్లి మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న గిల్… భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో, మరెన్ని రికార్డులు బద్దలు కొడతాడో అని… టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు.

మూడో టీ-20లో కివీస్‌పై చెలరేగి పోయాడు… గిల్. కేవలం 54 బంతులకే సెంచరీ మార్క్ అందుకున్న గిల్… మ్యాచ్ చివరి దాకా ఆడి, 63 బంతుల్లో 126 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×