Big Stories

NCERT: ఎన్‌సీఈఆర్టీలో 170 ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్ పోస్టుల భర్తీ.. పరీక్ష లేదు

NCERT: నిరుద్యోగులకు న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్, డీటీపీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 170 పోస్టుల ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్లు/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- Advertisement -

మొత్తం ఖాళీలు: 170

- Advertisement -

అసిస్టెంట్ ఎడిటర్: 60 పోస్టులు

సబ్జెక్ట్‌‌ల వారీగా: ఇంగ్లీష్- 25, హిందీ- 25, ఉర్దూ- 10.

విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (బుక్ పబ్లిషింగ్/మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం, ఎడిటింగ్ సబ్జెక్ట్‌), ఎడిటింగ్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 50 ఏళ్లు

వేతనం: నెలకు రూ.80,000.

పదవీకాలం: నాలుగు నెలలు.

స్క్రీనింగ్ రిజిస్ట్రేషన్: ఫిబ్రవరి 1.

స్కిల్ టెస్ట్: ఫిబ్రవరి 3న నిర్వహిస్తారు.

ప్రూఫ్ రీడర్: 60 పోస్టులు

సబ్జెక్ట్‌‌ల వారీగా: ఇంగ్లీష్-25, హిందీ-25, ఉర్దూ- 10.

విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఇంగ్లీష్/హిందీ/ఉర్దూ)తో పాటు కాపీ హోల్డర్/ప్రూఫ్ రీడర్‌గా ప్రింటింగ్ లేదా పబ్లిషింగ్ ఆర్గనైజేషన్ నుంచి కనీసం 01 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు.

వేతనం: నెలకు రూ.37,000.

పదవీకాలం: నాలుగు నెలలు.

స్క్రీనింగ్ రిజిస్ట్రేషన్: ఫిబ్రవరి 01.

స్కిల్ టెస్ట్: ఫిబ్రవరి 02.

డీటీపీ ఆపరేటర్: 50 పోస్టులు

సబ్జెక్ట్‌‌ల వారీగా: ఇంగ్లీష్-20, హిందీ-20, ఉర్దూ- 10.

విద్యార్హత: ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్‌లో ఒక సంవత్సరం డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు, పబ్లిషింగ్ హౌస్‌లో పాఠ్యపుస్తకాల తయారీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 45 సంవత్సరాలు.

వేతనం: నెలకు రూ.50,000.

పదవీకాలం: నాలుగు నెలలు.

స్క్రీనింగ్ రిజిస్ట్రేషన్: ఫిబ్రవరి 01.

స్కిల్ టెస్ట్: ఫిబ్రవరి 02, 03 తేదీల్లో నిర్వహిస్తారు.

వేదిక: Publication Division, NCERT, Sri Aurobindo Marg, New Delhi-110016

పూర్తి వివరాలకు: వెబ్‌సైట్‌ ను సందర్శించాలి.

ఈ ఉద్యోగాలన్నింటికీ అప్లై చేసుకొనే అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో తమ బయోడేటాతో పాటు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News