Big Stories

Ashwin-Jadeja Duo Record : టెస్టుల్లో భారత్ స్పిన్ జోడీ హవా.. రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్ జడేజా ద్వయం..

Ashwin-Jadeja Duo

Ashwin-Jadeja Duo Record : టీమ్ ఇండియా-ఇంగ్లాండ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్  లో అప్పుడే రికార్డుల రాక మొదలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలిరోజే ఆల్ అవుట్ అయ్యింది.

- Advertisement -

ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ జడేజా, రవిచంద్రన్ అశ్విన్ చెరో మూడేసి వికెట్లు తీసి, ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. అయితే వ్యక్తిగతంగా కాకుండా ఇద్దరూ కలిసి, టీమ్ ఇండియా తరఫున టెస్ట్ ల్లో అత్యధిక వికెట్లు తీసిన జోడిగా అరుదైన రికార్డు సాధించారు.

- Advertisement -

వీరికన్నా ముందు భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జంటగా అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్  ఉన్నారు. వీరిద్దరూ కలిసి 54 టెస్టులు ఆడారు. అలా 501 వికెట్లు సాధించారు. వీటిలో కుంబ్లే 281 వికెట్లు, హర్భజన్ 220 వికెట్లు తీశారు.

అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలిటెస్టులో అశ్విన్, జడేజా ఇద్దరూ కలిసి 50 టెస్టుల్లోనే ఈ రికార్డ్ ను అధిగమించారు.  ఓపెనర్లు క్రాలే, డకెట్‌లను ఇద్దరూ అవుట్ చేయడంతో 504 వికెట్లు వీరిద్దరి ఖాతాలో పడ్డాయి. అలా అశ్విన్ 277 వికెట్లు తీయగా, జడేజా 227 వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్, జడేజా జోడీ కీలకంగా మారనున్నారు. అంతేకాదు పదేళ్లుగా టెస్టు ఫార్మాట్‌లో భారత్ సాధించిన విజయాల్లో వీరిద్దరు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఒక విజయవంతమైన జోడీగా కూడా పేరు తెచ్చుకున్నారు.

వీరిద్దరూ కాకుండా హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్ జోడి 59 టెస్ట్ ల్లో 474 వికెట్లు తీసుకుంది.అంతర్జాతీయంగా చూస్తే ఇంగ్లాండ్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ జోడీ రికార్డ్ స్థాయిలో 138 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. అదేరీతిలో 1039 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించారు.

అలాగే ఆస్ట్రేలియా నుంచి చూస్తే షేన్ వార్న్-మెక్ గ్రాత్ జోడీ 104 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. 1001 వికెట్లు తీసుకుని వారొక చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఈ రెండు దేశాల్లో వీరి జోడీలే నెంబర్ వన్ గా, నెంబర్ 2 గా ఉన్నారు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News