BigTV English

New Cell Technology:ట్యూమర్లను కనిపెట్టే సెల్ టెక్నాలజీ..

New Cell Technology:ట్యూమర్లను కనిపెట్టే సెల్ టెక్నాలజీ..

New Cell Technology:వైద్యరంగానికి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలు అవసరమవుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్ల వల్ల, కాలుష్యం వల్ల కొత్త కొత్త అనారోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు మానవాళిని ఇబ్బంది పెడుతునే ఉన్నాయి. అందుకే వైద్యులతో పాటు పరిశోధకులు కూడా ఎలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. తాజాగా డీఎన్ఏ రీసెర్చ్‌లో ఓ కొత్త విషయాన్ని కనుగొన్నట్టుగా హాంగ్ కాంగ్ శాస్త్రవేత్తలు తెలిపారు.


డీఎన్ఏ, ఆర్ఎన్ఏపై పరిశోధకులు విరామం లేకుండా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఏ వ్యాధి అయినా.. ముందుగా వీటిపైనే ఎఫెక్ట్ చూపిస్తుందని వారి గట్టి నమ్మకం. అంతే కాకుండా మనిషి ఆరోగ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే డీఎన్ఏ పరీక్షలు అవసరమని కూడా వారు అంటారు. అయితే ఈ రెండిటిని కలపాలని శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నారు. దీనికోసం కొన్ని ప్రక్రియలు కూడా కనుగొన్నారు.

తాజాగా హాంగ్ కాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (హెచ్‌కస్ట్) చేసిన పరిశోధనల్లో ఓ టెక్నాలజీ ద్వారా డీఎన్ఏ, ఆర్ఎన్ఏను కలపడం సులభమని తేలింది. మనిషి శరీరంలో ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే టిష్యూలతో పాటు ముందు నుండే ఉన్న టిష్యూలు కూడా ఉంటాయి. ఈ రెండింటిలో డీఎన్ఏ, ఆర్ఎన్ఏలను ఒకేసారి కలపడం కష్టమనుకునే శాస్త్రవేత్తలకు ఈ టెక్నాలజీ ద్వారా ఓ పరిష్కారం దొరికింది. అయితే ఈ టెక్నాలజీ ద్వారా మనిషి శరీరంలో ఏర్పడే కొన్ని ట్యూమర్లను కూడా సులువుగా కనుక్కోవచ్చని వారు బయటపెట్టారు.


ఇప్పటివరకు మనిషి శరీరంలో ఏర్పడే ప్రతీ రకమైన క్యాన్సర్‌కు, ప్రతీ రకమైన ట్యూమర్‌కు చికిత్స కనుక్కోవడం కష్టంగా మారింది. దానికోసం డీఎన్ఏను, ఆర్ఎన్ఏను కలపడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీల సాయంతో ఈ ప్రక్రియ కొంచెం కష్టంగానే ఉంది. కానీ తాజాగా కనిపెట్టిన టెక్నాలజీతో ఇది సులభంగా మారిందని వారు తెలిపారు. ముందుగా ఈ టెక్నాలజీని ఆస్ట్రోసైటోమా అనే భయంకరమైన బ్రెయిన్ ట్యూమర్‌పై ఉపయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఆస్ట్రోసైటోమా అనేది బయటపడిన తర్వాత దాదాపు అయిదేళ్లలో పేషెంట్లు చనిపోతారు. అందులో చికిత్స అందుకున్నా కూడా బతికే శాతం చాలా తక్కువగా ఉండేది. కొత్త సెల్ టెక్నాలజీ ద్వారా ఆస్ట్రోసైటోమా సోకిన వారి సెల్స్‌ను శాంపిల్‌గా తీసుకొని పరీక్షిస్తున్నారు శాస్త్రవేత్తలు. అసలు ట్యూమర్ అనేది శరీరంలోని ఇతర భాగాలుగా ఎలా వ్యాపిస్తుంది, చికిత్సకు కూడా స్పందించడానికి ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ పరీక్షల ద్వారా బయటపడవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

IT Sector:నష్టాల్లో ఐటీ రంగం..? నిజమేనా..?

Technology:పక్షవాతం వచ్చినవారికి సాయం చేసే టెక్నాలజీ..

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×