Big Stories

Plastic Boxes : ఆహారంలో కెమికల్స్.. ప్లాస్టిక్ బాక్సుల వల్లే..

Plastic Boxes

Plastic Boxes : ప్లాస్టిక్ అనేది ఒక భూతం లాంటిదని, దాని వినియోగం ఎంత తగ్గిస్తే.. భూమికి అంత మంచిదని పర్యావరణవేత్తలు ఎప్పటినుండో చెప్తూనే ఉన్నారు. కానీ మనుషుల జీవితాల్లో భాగమయిపోయిన ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం అసాధ్యంగా మారింది. దీని వల్ల మనుషులకు హాని కలుగుతుందని తెలిసినా కూడా అదుపు చేయాలని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ ప్లాస్టిక్ వల్ల కలిగే మరో హానిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

- Advertisement -

ప్లాస్టిక్‌తో తయారయ్యే కొన్ని వస్తువుల్లో పీఎఫ్ఏఎస్ (పర్ అండ్ పాలిఫ్లోరోలికల్ సబ్‌స్టేన్సెస్) ఉంటాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అంటే వీటిలో హానికరమైన ఫ్లోరిన్ కాంపౌండ్లు ఉంటాయని వారు గుర్తించారు. వీటినే ఫరెవర్ కెమికల్స్ అని కూడా అంటారు. ఇప్పటికే మనుషుల రోజూవారి జీవితంలో ఉపయోగించే క్లీనర్స్, పెస్టిసైడ్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్యాకింగ్ బాక్సులలో పీఎఫ్ఏఎస్ ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతే కాకుండా ఫుడ్ ప్యాకింగ్ బాక్సుల నుండి పీఎఫ్ఏఎస్.. ఆహారంలోకి కూడా చేరుతుందని వారు భావిస్తున్నారు.

- Advertisement -

పీఎఫ్ఏఎస్ అనేది బాక్సుల నుండి ఆహార పదార్థాల్లోకి వెళ్లడం వల్ల అది తిన్న తర్వాత మనిషి శరీరంలోకి నేరుగా కెమికల్స్ ప్రవేశించినట్టే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని వల్ల కిడ్నీతో పాటు మరెన్నో ఇతర క్యాన్సర్లు, థైరాయిడ్, బరువు తగ్గడం, ఇమ్యూనిటీ లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయని వారు బయటపెట్టారు. బాక్సులలో ఉండే పీఎఫ్ఏఎస్ శాతాన్ని బట్టి మనిషి శరీరంలోకి ఎంత శాతం ఈ కెమికల్ వెళుతుందని కనిపెట్టే అవకాశం ఉందన్నారు.

ప్లాస్టిక్ బాక్సులు కేవలం ఆహారాన్ని స్టోర్ చేయడానికే తయారు చేయబడకపోయినా.. ప్రస్తుతం ఇవి పూర్తిగా దానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అంతే కాకుండా పెస్టిసైడ్స్ లాంటివి పీఎఫ్ఏఎస్ ఉన్న కంటెయినర్స్‌లో స్టోర్ చేయబడితే.. దాని వల్ల పీఎఫ్ఏఎస్ పంటలలోకి ఆ తర్వాత ఆహార పదార్థాల్లోకి కూడా చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2021 నుండి పీఎఫ్ఏఎస్ వల్ల మనుషులకు జరిగే హాని గురించి స్టడీ చేయడంలో శాస్త్రవేత్తలు లీనమయ్యారు. అంతే కాకుండా ఇది పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుందని వారు కనిపెట్టారు. ఇక పీఎఫ్ఏఎస్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటే మేలు అనేదానిపై పరిశోధనలు జరగనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News