BigTV English

Ramcharan: రామ్‌చరణ్ సీక్రెట్స్.. షేర్ చేసిన గాడ్‌ఫాదర్..

Ramcharan: రామ్‌చరణ్ సీక్రెట్స్.. షేర్ చేసిన గాడ్‌ఫాదర్..

Ramcharan: రామ్‌చరణ్.. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆస్కార్ వరకు ఎదిగిన హీరో. ఆర్ఆర్ఆర్ వంటి అద్భుతమైన సినిమాలో అదరగొట్టిన హీరో. అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలిచిన హీరో. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలను చిరంజీవి షేర్ చేసుకున్నారు.


టాలీవుడ్ మోస్ట్ ఫేమస్ డ్యాన్సర్లలో చిరంజీవి పేరు ముందుంటుంది. కానీ అతని కొడుకు చరణ్ మాత్రం చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే దూరంగా ఉండేవాడట. అల్లు అర్జున్, శిరీష్ డ్యాన్స్ వేస్తుంటే చూస్తుండేవాడట. కానీ తాను చేసే వాడు కాదట. ఒకానొక సమయంలో చరణ్ డ్యాన్స్ చేస్తాడా లేడా అని చిరంజీవి టెన్షన్ కూడా పడ్డాడడట. ఆ సమయంలో తండ్రి ముఖంలో టెన్షన్ చూసిన చరణ్.. తానంతట తానే స్వయంగా డ్యాన్స్ నేర్చుకున్నాడట. ఇప్పుడు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు చరణ్.

ఇకపోతే చరణ్‌కు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండేదట. కానీ చిరంజీవి అంటే భయంతో సినిమా వార్తలకు దూరంగా ఉండేవాడట. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరని చరణ్ సినీ మ్యాగజైన్ ఓపెన్ చేశాడట. అదే సమయంలో సడెన్‌గా చిరంజీవి వచ్చాడట. దీంతో చరణ్ భయంతో వణికిపోయాడట. ఇక చరణ్ పదో తరగతి పాస్ అయిన తర్వా చిరంజీవి కొంచెం సినీ ఫ్రీడమ్ ఇచ్చాడట చిరంజీవి.


ఒక 2007లో డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ తెరకెక్కించిన చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చరణ్. తన మొదటి సినిమాతోనే రచ్చ చేసి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును నందీ స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు చరణ్.

ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా చరణ్‌ మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత ఆరెంజ్, రచ్చ, తుఫాన్, నాయక్, ఎవడు, బ్రూస్ లీ, ధ్రువ, రంగస్థలం, ఆచార్య వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.

గతేడాది రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. ఆస్కార్ వేదికపై అదరగొట్టింది. ఈ మూవీలోని నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం చరణ్ డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్15 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో గేమ్‌ఛేంజర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×