E-Paper
Advertisement

Pradeep Ranganathan : రాంగ్ స్టెప్ తీసుకోబోతున్న హీరో.. ఇలా అయితే కష్టమే గురు..

Pradeep Ranganathan : రాంగ్ స్టెప్ తీసుకోబోతున్న హీరో.. ఇలా అయితే కష్టమే గురు..
Advertisement

Pradeep Ranganathan : కోలీవుడ్ స్టార్ హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తన సినిమాలతో ప్రేక్షకులను బాగా మెప్పించాడు. ఈ డైరెక్టర్ కాస్త హీరోగా మరి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. లవ్ టుడే, డ్రాగన్, రీసెంట్ గా డ్యూడ్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాలో అతనికి మంచి క్రేజ్ ను అందించాయి. ఇక ఆ తర్వాత ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దురంధర్ 2 ఎఫెక్ట్.. లవ్ ఇన్సూరెన్స్ వాయిదా..

ప్రదీప్ రంగనాథన్ సినిమాలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువే అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు హీరోగా నటించిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలవడంతో పాటుగా.. 300 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నాయి. ప్రస్తుతం ఈయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం లవ్ ఇన్సూరెన్స్.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మూవీ వాయిదా పడబోతుంది అంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఈనెల ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన రణవీర్ సింగ్ దురంధర్ 2 ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేర్ చేస్తుంది. భారీ యాక్షన్ కథా చిత్రంతో పాటుగా ఈ సినిమా కలెక్షన్స్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా వెళ్లేంతవరకు మిగతా సినిమాలని రిలీజ్ చేయాలని అనుకోవడం లేదు. ఇప్పటికే ఈ మూవీ వల్ల చాలా సినిమాలు వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఈ మూవీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :బాలు కోసం ఆలోచిస్తున్న మీనా.. బల్లి పడటంతో ప్రభావతి షాక్.. శివ వీడియో వైరల్..

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ…

ప్రదీప్ రంగనాథన్ హీరోగా, టాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. 7 స్ర్కీన్‌ స్టూడియో బ్యానర్‌పై లలిత్‌ కుమార్‌ రౌడీ పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. లవ్‌, బ్రేకప్‌ వంటి అంశాలతో రూపొందించినట్టుగా కనిపిస్తుంది. భవనంపై ‘బ్రేకప్‌ క్లెయిమ్‌ పెనాల్టీ’ అని రాసివుంది. ప్రదీప్‌ రంగనాథన్‌ ఫోన్‌ టచ్‌ చేస్తున్నట్లుగా ఉన్న లుక్‌ అందరిని ఆకర్షిస్తోంది. ఇందులో ఎస్‌జే సూర్య, సీమాన్‌, కృతిశెట్టి, యోగిబాబు, ఆనంద్‌ రాజ్‌, మాళవిక, సునీల్‌ రెడ్డి తదితరులు నటించారు.. మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఏది ఏమైనా కూడా ఈ మూవీ కోసం ఫాన్స్ ఈగరుగా వెయిట్ చేస్తున్నారు..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×