E-Paper
Advertisement

Babu Mohan: ఇక్కడ ఆయనదే పెత్తనం.. ఇంకెప్పుడూ నన్ను పిలవకండి.. బాబు మోహన్ ఫైర్!

Babu Mohan: ఇక్కడ ఆయనదే పెత్తనం.. ఇంకెప్పుడూ నన్ను పిలవకండి.. బాబు మోహన్ ఫైర్!
Advertisement

Babu Mohan:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న బాబు మోహన్ (Babu Mohan) అటు రాజకీయాలలో కూడా తనదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రిగా పేరు దక్కించుకున్న ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా మారిపోయారు. అటు ఓటిటి లలో కూడా తన సినిమాలను విడుదల చేస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంటున్న బాబు మోహన్ తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) పై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇక్కడ పెత్తనం సురేష్ బాబుది అని దయచేసి తనను ఇంకెప్పుడూ ఇక్కడికి పిలవకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.

సురేష్ బాబుదే పెత్తనం.. ఇంకెప్పుడూ నన్ను పిలవకండి..

అసలు విషయంలోకి వెళ్తే.. దివంగత మూవీ మొఘల్ డి రామానాయుడు స్థాపించిన రామానాయుడు స్టూడియోలో తాజాగా చింతామణి నాటకాన్ని ప్రదర్శించారు. దీనిని వీక్షించడానికి మోహన్ బాబును అతిధిగా ఆహ్వానించారు. అయితే ఒక మాజీ మంత్రిగా, నటుడిగా తనకు సభా మర్యాద ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. రామానాయుడు స్టూడియోలో ఇక్కడ సురేష్ బాబు గారిదే పెత్తనం. నన్ను మళ్ళీ ఇక్కడికి పిలవకండి అంటూ అసహనంతో పాటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదని అయితే కేవలం డి రామానాయుడు మీద ఉన్న ప్రేమతోనే తాను ఇక్కడికి వచ్చానని , రామానాయుడు కంటే సురేష్ బాబు చాలా గొప్పవారు అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు బాబు మోహన్. ప్రస్తుతం బాబు మోహన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పాత రోజులను గుర్తు చేసుకున్న బాబు మోహన్..

Advertisement

ఇదే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రామానాయుడు అంటే నాకు ఎంతో గౌరవం. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వారు .ముఖ్యంగా నేను అంకుశం , ఆహుతి వంటి చిత్రాల తర్వాత వారంలోనే 10 చిత్రాలకు సైన్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ సమయంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాత, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్నో సినిమాలు చేశాను. వాళ్లు నన్ను బాగా ప్రోత్సహించారు. అదే సమయంలో నాకు మంచి మంచి పాత్రలు ఇచ్చి డి రామానాయుడు కూడా నన్ను ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు ఆయనకంటే సురేష్ బాబు మరింత గొప్పవారు అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు

ALSO READ:Summer Re Release Movie: సమ్మర్ స్పెషల్ రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న స్టార్ హీరోల సినిమాలు.. లిస్ట్ వైరల్!

మర్యాద ఇవ్వడంలో నిర్వాహకులు విఫలమయ్యారా?

Advertisement

తన కెరియర్ ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడుతూ..” నాకు చింతామణి నాటకం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి చింతామణి నాటకం వచ్చిందంటే చాలు ఇంట్లో చెప్పకుండా వెళ్లి రాత్రంతా ఆ నాటకాన్ని చూసేవాడిని. సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఈ నాటకంలో నటించే అవకాశం కోల్పోయాను.. ఇక నేను నా సినిమా కెరియర్ ఆరంభంలో చాలా బిజీగా ఉండే వాడిని. ఒకానొక సమయంలో రోజుకు ఆరు షిఫ్ట్లు అంటే తెల్లవారుజామున 4:00 నుండి సాయంత్రం 6:00 వరకు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి.. ఇప్పటికీ నా చేతిలో పది సినిమాలు ఉన్నాయి. ఇటీవల ఓటీటీలో విడుదలైన నా చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి” అంటూ బాబు మోహన్ తెలిపారు . ప్రస్తుతం తాను పేదవారి కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజీగా ఉన్నప్పటికీ.. చింతామణి నాటకం.. అది కూడా రామనాయుడు స్టూడియోలో అని చెప్పడంతో వారి మీద గౌరవంతో వచ్చాను.. కానీ తనకు సభా మర్యాద ఇవ్వలేదు.. ఒక మాజీ మంత్రిని సీనియర్ నటుడిని గౌరవించడంలో నిర్వాహకులు విఫలమయ్యారు అంటూ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×