BigTV English
Advertisement

Recharge Offers: ఈ సిమ్ కార్డ్ వాడుతున్న వారికి గుడ్‌న్యూస్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ పొందొచ్చు..!

Recharge Offers: ఈ సిమ్ కార్డ్ వాడుతున్న వారికి గుడ్‌న్యూస్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ పొందొచ్చు..!

Recharge Offers: ప్రముఖ టెలికం సంస్థలు తమ వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకు వస్తున్నాయి. ఇందులో జియో, ఎయిర్‌టెల్ ముందు వరుసలో ఉండగా.. వొడాఫొన్ ఐడియాతో సహా మరికొన్ని సంస్థలు తర్వాతి వరుసలో ఉన్నాయి. ఈ సంస్థలు కాంబో ప్యాకేజీల పేరుతో కాల్స్, డేటాతో పాటు ఓటీటీ సేవలను అందిస్తున్నాయి. ఇలాంటి ఓ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్‌ ద్వారా ఉచితంగా ఓటీటీ సేవలు పొందొచ్చు.


తాజాగా జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు నెట్‌ఫ్లిక్స్ సేవలను ఫ్రీగా అందించే ప్లాన్‌ను తీసుకువచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జియో రీఛార్జ్‌ ప్లాన్‌..


రిలయన్స్‌ జియో తాజాగా రూ.1499తో రీఛార్జ్‌ ప్లాన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా.. మరో బెనిఫిట్ కూడా ఉంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందవచ్చు.

ఇది కాకుండా.. రూ.1099తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 ఫ్రీ ఎస్ఎంఎస్‌లు, రోజువారీ 2జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందొచ్చు. అదనంగా జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లు, జియో టీవీ, జియో సినిమా వంటివి ఉచితంగా లభిస్తాయి.

ఎయిర్‌‌టెల్ ప్లాన్‌..

ఎయిర్‌టెల్‌ రూ.1499 ప్లాన్‌ను తమ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి. అలాగే ఉచిత హలోట్యూన్స్, 3 నెలల అపోలో 24/7, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, వింక్ మ్యూజిక్ వంటివి పొందొచ్చు. ఇక వీటితో పాటు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×