BigTV English

Telangana Crop Insurance : అన్నదాతకు పంట బీమా.. ఎప్పుడంటే?

Telangana Crop Insurance : అన్నదాతకు అండగా నిలిచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పంట బీమాపై దృష్టి సారించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంట నష్టపోయే రైతన్నకు బీమా కల్పించి ఆదుకోవాలన్న ఉద్దేశంతో వచ్చే ఖరీఫ్ సీజన్‌ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

Telangana Crop Insurance : అన్నదాతకు పంట బీమా.. ఎప్పుడంటే?
Telangana news today

Telangana Crop Insurance(Telangana news today) :

అన్నదాతకు అండగా నిలిచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పంట బీమాపై దృష్టి సారించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంట నష్టపోయే రైతన్నకు బీమా కల్పించి ఆదుకోవాలన్న ఉద్దేశంతో వచ్చే ఖరీఫ్ సీజన్‌ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.


ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనను అమల్లోకి తీసుకువస్తారా? లేదంటే కొత్తగా పంటల బీమా పథకానికి రూపకల్పన చేస్తారా అన్న విషయంపై క్లారిటీ రానుంది. దీనిపై త్వరలోనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష తర్వాత ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్నదాతల కోసం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కావడంతో వచ్చే ఏడాది నుంచే ఈ పథకం అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్‌ సర్కార్‌.

మరోవైపు దేశవ్యాప్తంగా పంట బీమా అమలవుతండగా ఒక్క తెలంగాణలో మాత్రమే ఈ స్కీం అందుబాటులో లేదు. పీఎం ఫసల్‌ బీమాతో ఏ మాత్రం ఉపయోగం లేదని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే 2020లో బయటకు వచ్చింది. దీంతో ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోయారు. వారికి పసల్‌ బీమా యోజన అందలేదు. అయితే ప్రస్తుతం రేవంత్ సర్కార్‌ దీనిపై దృష్టి సారించింది. పంట నష్టపోయిన వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో పంట బీమాపై కసరత్తు చేస్తోంది.


ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోచన తెలంగాణలో ప్రవేశపెట్టినా, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీం తీసుకువచ్చినా పంట బీమా పథకం 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. రాష్ట్రంలో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. కాబట్టి వీరికి బీమా ప్రీమియం కాకుండా చూడాలంటున్నారు. కాగా.. ఈ పథకానికి సంబంధించి ఖరీఫ్‌ కోసం మే నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసి లోనింగ్‌, నాన్‌ లోనింగ్‌ రైతులందరికీ పంట బీమా వర్తింపజేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×