Rice Prices Hike In India: సామాన్యులకు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే నిత్యావసర సరుకులు, ఆయిల్, పప్పు ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అదే విధంగా ఉల్లి ధరలు సైతం గత కొంతకాలంగా వేధిస్తున్నాయి. ఈ తరుణంలో సామాన్యులపై మరో భారం పడనుంది.
దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం సోనామసూరి, హెచ్ఎంటీ, బీపీటీ తదితర సన్నబియ్యం ధరలు కిలోకు రూ. 60 నుంచి 70 వరకు ఉన్నాయి. అయితే బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేయడంతో బియ్యం రేట్లు భారీగా పెరగనున్నాయి. పారా బాయిల్డ్, బ్రౌన్ రైస్ పై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గంచడంతో ఈ ప్రభావం పడనుందని అనుకుంటున్నారు.
మరోవైపు దేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో పంటనష్టం, వరిసాగు తగ్గడంతో బియ్యం రేట్లు పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. మారుతున్న కాలంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్ని చర్యుల తీసుకున్నా.. రోజు రోజుకూ వరి సాగు తగ్గుముఖం పడుతోంది. రైతుల కోసం ప్రత్యేక పథకాల సహాయంతో బెనిఫిట్స్ అందిస్తోంది. కానీ పంట వేసిన రైతులకు ప్రకృతి ప్రకోపాలతో నష్టం వాటిల్లడంతో పాటు మార్కెట్ లోనే గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి.
Also Read: కేసీఆర్ నుంచి సంకేతాలా..? డబుల్ గేమ్ మొదలుపెట్టిందా?
మోదీ సర్కార్ గతంలో బియ్యం విషయంలో ఎగుమతులపై నిషేధం విధించింది. దేశంలో తగినంత నిల్వలు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కొంతమంది వ్యాపారులు కృత్తిమ కొరత సృష్టించారు. దీంతో బియ్యం ధరలు పెరగనున్నట్లు సమాచారం.
మరోవైపు, దేశవ్యాప్తంగా బియ్యం వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బాస్మతి బియ్యం ధరల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని చెబుతున్నారు.