BRS: బీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందా? అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. లేనప్పుడు మరో మాట మార్చడం అలవాటుగా పెట్టుకుందా? మూసీ అభివృద్ధి జరిగితే తమ పనైపోయినట్టేనని భావిస్తోందా? అందుకే మూవీ ప్రక్షాళనను అడ్డుకోవాలనే స్కెచ్ వేసిందా? ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా? మూసీ ప్రాంతాల్లో ఆ పార్టీ నేతల పర్యటనల వెనుక ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు సామాన్యులను సైతం వెంటాడుతోంది.
తెలంగాణలో రాజకీయాలు మూసీ అభివృద్ధి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ అంశంపై రోజుకో బీఆర్ఎస్ నేత హడావుడి చేస్తున్నారు. మూవీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతల విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది బీఆర్ఎస్. ప్రతీరోజూ దీనిపై రాద్దాంతం చేయాలంటూ పార్టీ హైకమాండ్ నుంచి కీలక నేతలకు సంకేతాలు వెళ్లాయన్నది అందులోని సారాంశం.
హైకమాండ్ సంకేతాలపై కారు పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదల కూడదని, ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయాలనే సంకేతాలు వచ్చాయట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమణలు కూల్చివేస్తామని, సహకరించాలని కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. రెండు నాలుక ధోరణి కష్టమని కొందరు నేతలు అభిప్రాయానికి వచ్చారట.
అందుకే రోజుకో బీఆర్ఎస్ నేత మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం లంగర్‌హౌస్ ప్రాంతాల్లో పర్యటించిన హరీష్‌రావు, ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సోమవారం కేటీఆర్ కూడా మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించనున్నారు. నేరుగా రేవంత్ సర్కార్‌ను టార్గెట్ చేయాలని ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
ALSO READ: మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత.. వైద్యశాలల సంఖ్య పెంచుతాం: సీఎం రేవంత్ రెడ్డి
సందట్లో సడేమియా ఇదేనేమో.. మూసీ- హైడ్రాల కలిపి విమర్శలు గుప్పిస్తున్నారు కారు పార్టీ నేతలు. పరిస్థితి గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా కేవలం చెరువులు, ఆక్రమణలు కాపాడేందుకు మాత్రమేనని గుర్తు చేశారు అధికారులు. మూసీని ప్రక్షాళన చేస్తున్నామని, మరో రెండేళ్లలో మంచి నీరు పారించాలనేది తమ ఉద్దేశమని అంటున్నారు.
బీఆర్ఎస్ రాజకీయాలకు గమనించిన మంత్రి శ్రీధర్‌బాబు, మూసీపై అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని దుయ్యబట్టారు. అరాచక శక్తులను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని, ఇది రాజకీయం కాదన్నారు. మూసీ ప్రక్షాళన కోసం ముందుకు వెళ్తున్నామని, నిర్వాసితులందరికి న్యాయం చేస్తామన్నారు.
మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసంటూ వివరించారు సదరు మంత్రి. మూసీ నిర్వాసితులకు పూర్తి భరోసా రేవంత్ సర్కార్ ఇస్తోందని, డబుల్ బెడ్రూం ఇళ్లు, పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు చేపడుతోందన్నారు.
గత పదేళ్లు మూసీని మరింత కంపుగా మార్చిందా కారు పార్టీ కాదా అంటూ ప్రశ్నలు సంధించారు. మురికికంపులో హైదరాబాద్ వాసులు ఉండాలా అంటూ విరుచుకుపడ్డారు. కూల్చివేతలపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే దానం సైతం ప్రస్తావించడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.