E-Paper
Advertisement

FedEx H-1B Row: అమెరికా సిబ్బందిని తొలగించి.. H1b వర్కర్లకు ఉద్యోగాలిచ్చిన ఇండియన్ సీఈవో

FedEx H-1B Row: అమెరికా సిబ్బందిని తొలగించి.. H1b వర్కర్లకు ఉద్యోగాలిచ్చిన ఇండియన్ సీఈవో
Advertisement

FedEx H-1B Row: 2022 చివరిలో ఫెడెక్స్ 2 బిలియన్ డాలర్లకు పైగా విలువైన భారీ ఫెడరల్ డెలివరీ కాంట్రాక్టును పొందింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత, కంపెనీ ఉద్యోగుల నియామక విధానంలో మార్పులు జరిగాయి. ఫెడెక్స్ H-1B వీసా ద్వారా విదేశీ ఉద్యోగుల సంఖ్యను పెంచింది. అదే సమయంలో అమెరికన్ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించిందని ఆ దేశ మీడియా ప్రచారం చేస్తుంది. ఇదంతా ఇండియన్ సీఈవో ఉన్న ఫెడెక్స్ సంస్థలో జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.

ఫెడెక్స్ పై అభియోగాలు

ఈ ప్రచారంపై ఫెడెక్స్ స్పందించారు. వ్యాపార అవసరాలు, నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగుల భర్తీ చేపడుతున్నట్లు వివరించింది. ఫెడెక్స్ ఉద్యోగులు అభివృద్ధికి, కంపెనీ కార్యకలాపాలకు అనుగుణంగా ఉద్యోగులను భర్తీపై దృష్టి సారించామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే H-1B వీసా కలిగి ఉద్యోగులను నియమించడంపై ఫెడెక్స్ పై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో.. విదేశీ ఉద్యోగులుపై భారీగా ప్రభావం పడింది. భారతీయ సంతతికి చెందిన ఫెడెక్స్ సీఈవో రాజేష్ సుబ్రమణ్యం.. విదేశీయులను నియమించుకోవడానికి అమెరికన్లను తొలగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ H-1B డేటా ప్రకారం, 2022లో ఒప్పందం తర్వాత ఫెడెక్స్ 24 మంది H-1B కార్మికులను కలిగి ఉంది. ఆ తరువాత మూడు సంవత్సరాలలో ఆ సంఖ్య దాదాపు 500కి పెరిగింది.

ఫెడెక్స్ తో ఒప్పందం

ఈ నివేదికకు స్పందిస్తూ.. FedEx ఉద్యోగులకు వారి కెరీర్‌లలో ఎదగడానికి, ముందుకు సాగడానికి అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫెడెక్స్ వ్యూహం వ్యాపార అవసరాలను తీర్చగల నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించడం, అత్యంత అర్హత కలిగిన అభ్యర్థులను భర్తీ చేయడం అని తెలిపారు. డిసెంబర్ 2022లో యూఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ కమాండ్ ప్రభుత్వ సంస్థలకు ప్యాకేజీలను అందించడానికి FedEx తో పాటు మరో రెండు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ జనరేషన్ డెలివరీ సర్వీస్-2 ప్రోగ్రామ్ కింద మొత్తం 2.24 బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది.

Advertisement

ఈ ఒప్పందం ఏప్రిల్ 1, 2023న ప్రారంభమై సెప్టెంబర్ 30, 2026న ముగుస్తుంది. ప్రభుత్వ నివేదిక ప్రకారం.. విదేశీ నియామకాలు పెరిగిన సమయంలోనే FedEx యూఎస్ కార్మికులను తొలగించిందనే అభియోగాలు ఉన్నాయి. నవంబర్ 2025లో 856 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఫోర్ట్ వర్త్‌లో 305 ఉద్యోగాలను తొలగించింది. ఆ తర్వాత గార్లాండ్, ప్లానోలో మరో 131 ఉద్యోగాల కోత విధించింది.

H-1B పై పూర్తి నిషేధం

ట్రంప్ సర్కార్ కఠిన విధానాలతో H-1B వీసా రాజకీయ సమస్యగా మారింది. ముందుగా అమెరికన్ కార్మికులను నియమించుకోవడాన్ని ప్రయత్నించాలని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగా కంపెనీలను కోరారు. రిపబ్లికన్ మద్దతుదారులు H-1B వ్యవస్థపై పూర్తి నిషేధానికి విధించాలని కోరుతున్నారు. అయితే ప్రముఖ వ్యాపార నాయకులు విదేశీ ఉద్యోగుల అవసరాన్ని సమర్థించారు. డోజ్ మాజీ అధిపతి వివేక్ రామస్వామి, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఇద్దరూ యూఎస్ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా టెక్నాలజీ, ఐటీ రంగాలలో ప్రపంచ ప్రతిభ అవసరమని అభిప్రాయపడ్డారు.

Also Read: Cambodia Thailand Crisis: శివుడి భారీ విగ్రహాన్ని కూల్చేసిన థాయ్‌లాండ్ సైన్యం.. అసలు ఏం జరుగుతోంది అక్కడ?

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×