BigTV English

Pet Dogs: పెట్ డాగ్స్ వల్ల మనుషులకు క్యాన్సర్ రిస్క్..!

Pet Dogs: పెట్ డాగ్స్ వల్ల మనుషులకు క్యాన్సర్ రిస్క్..!

Pet Dogs: కెమికల్స్, ప్లాస్టిక్స్.. ఇలాంటివి మానవాళికి తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తాయి. ఒకప్పుడు పలు వస్తువుల్లో ఇలాంటివి ఉంటాయి అని కనిపెట్టడం సులభంగా ఉండేది. కానీ ఇప్పట్లో ప్రతీ వస్తువులో ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పైగా పలు జంతువుల్లో ఫరెవర్ కెమికల్స్ ఆనవాళ్లు చూసి వారు ఆశ్చర్యపోయారు. అంతే కాకుండా వీటి వల్ల మనుషులకు కూడా ప్రమాదం ఉందని వారు బయటపెట్టారు. ముఖ్యంగా ఈ జంతువుల్లో డాగ్స్ కూడా ఒకటని తేల్చారు.


ప్రతీ పెట్ డాగ్‌, పెట్ హార్స్‌లోని రక్తంలో ఫరెవర్ కెమికల్స్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అది కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయని చెప్తున్నారు. పెట్ డాగ్స్ అంటే చాలామందికి చాలా ఇష్టం. వాటిని ఇంట్లో మనుషులుగా పెంచుకుంటారు. కానీ వాటి రక్తంలోని ఫరెవర్ కెమికల్స్ అయిన పర్ అండ్ పాలీఫ్లోరోఅల్కిల్ (పీఎఫ్ఏ) వల్ల మనుషులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. కేవలం పెట్ డాగ్స్ మాత్రం కాదు పలు స్ట్రీట్ డాగ్స్ వల్ల కూడా ఈ సమస్యలు కలగవచ్చన్నారు.

ఈ జంతువుల్లో ఉండే ఫరెవర్ కెమికల్స్, పీఎఫ్ఏలు మెల్లగా మనుషుల శరీరాల్లోకి చేరుకొని లివర్, కిడ్నీ ఫంక్షన్స్‌ను దెబ్బతీస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముందుగా పీఎఫ్ఏలు మనుషుల కిడ్నీలను, లివర్‌నే టార్గెట్ చేస్తాయని అన్నారు. ముఖ్యంగా నార్త్ కరోలినా ప్రాంతంలో డాగ్స్, గుర్రాలు అనేవి ఫరెవర్ కెమికల్స్‌ను ఆకర్షించే వాతావరణంలో పెరుగుతాయని, అందుకే అక్కడ ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అందుకే వీటితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


పీఎఫ్ఏలు ఉండని చోటు అంటూ ఉండదు అని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఒకప్పుడు కేవలం పరిశ్రమల ద్వారానే ఈ కెమికల్స్ విడుదల అవుతాయని అనుకునేవారు కానీ వాతావరణంలోని ప్రతీ చోట ఇప్పుడు పీఎఫ్ఏలు అనేవి కనిపిస్తున్నాయని అన్నారు. ఇవి కిడ్నీ క్యాన్సర్, థైరాయిడ్, టెస్టిక్యులర్ క్యాన్సర్.. ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని అన్నారు. మనుషులతో పాటు డొమెస్టిక్ యానిమల్స్‌కు కూడా ఈ రిస్క్ ఉంటుంది అని ఎప్పుడో కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు పెట్ డాగ్స్ వల్ల ఓనర్లకు రిస్క్ ఉంటుందని చెప్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఓనర్లదే అన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×