E-Paper
Advertisement

Glucose in Brain : బ్రెయిన్‌లో గ్లూకోజ్ శాతం.. అలాంటి వ్యాధులపై ప్రభావం..

Glucose in Brain : బ్రెయిన్‌లో గ్లూకోజ్ శాతం.. అలాంటి వ్యాధులపై ప్రభావం..
Advertisement
Glucose in Brain

Glucose in Brain : మనిషి శరీరం అనేది ఎప్పటికీ అంతుచిక్కని ఒక మిస్టరీ. ప్రతీ ఒక్కరి శరీరం ఆరోగ్య సమస్యల విషయంలో ఒకేలాగా రియాక్ట్ అవ్వదు. అలాగే ఆహార పదార్థాల విషయంలో కూడా శరీరం ఎంతో కీ రోల్ ప్లే చేస్తుంది. పలు ఆహార పదార్థాలు ఎక్కవైనా, తక్కువైనా కష్టమే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా కొన్ని ఆహార పదార్థాలు శరీరంలో సరైన మోతాదులో లేకపోతే.. మానసికంగా కూడా ప్రభావం చూపిస్తాయని బయటపెట్టారు.

మనిషి శరీరంలో ఎంత శాతం షుగర్, ఎంత శాతం గ్లూకోజ్ ఉండాలి అనే విషయాలను బ్రెయిన్ డిసైడ్ చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రోజూవారికి మెదడు అనేది శరీరంలోని షుగర్, గ్లూకోజ్ శాతాన్ని గమనిస్తూనే ఉంటుందని చెప్పారు. తాజాగా శాన్ ప్రాన్సిస్కోలోని శాస్త్రవేత్తలు అసలు బ్రెయిన్ అనేది గ్లూకోజ్ శాతం సరిపోతుందా లేదా అని ఎలా డిసైడ్ చేస్తుంది? ఒకవేళ సరిపోకపోతే ఇతర శరీర భాగాలకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎలా పంపిస్తుందని పరిశోధనలు చేశారు.

Advertisement

ఇదివరకు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో బ్రెయిన్‌లోని గ్లూకోజ్ అంతా గ్లియా అనే సెల్స్‌కు చేరుకుంటాయని, ఇవి న్యూరాన్స్ యాక్టివిటీకి ఉపయోగపడతాయని తేలింది. బ్రెయిన్‌కు గ్లూకోజ్ అవసరమని తెలిసినా, అది ఎంత మోతాదులో అవసరమో తెలుసుకోవడం కోసం పరిశోధనలు మొదలయ్యాయి. న్యూరాన్స్ సరిగ్గా పనిచేయడం కోసం గ్లూకోజ్ అవసరం అవుతుందని తెలిసినా, అసలు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేదానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు.

అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు సోకినవారిలో బ్రెయిన్‌లో గ్లూకోజ్ శాతం తగ్గినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకవేళ బ్రెయిన్‌లోని గ్లూకోజ్ గురించి పూర్తిస్థాయిలో స్టడీ చేస్తే.. ఈ వ్యాధులకు మెరుగైన చికిత్సను కూడా అందించే అవకాశం ఉండవచ్చని వారు భావిస్తున్నారు. చాలావరకు మనిషి తినే ఆహారపదార్థాలు గ్లూకోజ్ రూపంలో శరీర అవయవాలను చేరుకుంటాయి. ఆ తర్వాత బ్రెయిన్‌లోని గ్లియాల్ సెల్స్‌కు గ్లూకోజ్ చేరి లాక్టేట్ అనే పదార్థాన్ని తయారు చేస్తుంది. కానీ గ్లయాల్ సెల్స్‌పై ఇప్పటివరక పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగలేదు.

Advertisement

ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో మాత్రం బ్రెయిన్‌లో సరిపడా గ్లూకోజ్ శాతం లేకపోతే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు అటాక్ చేస్తాయని తేలింది. ఇదే విధంగా మరికొన్ని పరిశోధనలు చేసి బ్రెయిన్ యాక్టివిటీ గురించి, అందులో గ్లూకోజ్ గురించి తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. న్యూరల్ ఫంక్షన్ గురించి సరిగ్గా తెలుసుకోవడం కోసం బ్రెయిన్‌లోని గ్లూకోజ్ శాతం గురించి స్టడీ చేయడం ముఖ్యమని వారు తెలిపారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×