EPAPER

Electric Car : ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసిన స్కోడా

Electric Car : ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసిన స్కోడా

Electric Car : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో కూడా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ప్రవేశించింది. సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఎన్యాక్ ఐవీ వీఆర్‌ఎస్‌’ను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే… ఎన్యాక్ 500 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణిస్తుందని స్కోడా చెబుతోంది. స్పోర్టీ-డిజైన్‌తో వస్తున్న ఈ కారు కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని… గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించవచ్చని స్కోడా క్లెయిమ్ చేస్తోంది.


ఇక ఎన్యాక్ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే… 82 కిలోవాట్ల బ్యాటరీ అమర్చారు. 296 BHP పవర్ ని అందించే ఎన్యాక్… కేవలం 36 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని స్కోడా వెల్లడించింది. ఇందులో ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ట్రాక్షన్ అనే ఐదు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. కస్టమర్ తన డ్రైవింగ్‌కి అనుగుణంగా ఎన్యాక్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక ఇతర ఫీచర్లు చూస్తే… గ్లాసీ-బ్లాక్ ఫ్రంట్ ఏప్రాన్స్, డోర్ మిర్రర్స్, రియర్ డిఫ్యూజర్ సహా ఎన్యాక్ కు మరిన్ని స్పోర్టీ ఫీచర్లను జోడించింది… స్కోడా. క్రిస్టల్ ఫేస్ ఫ్రంట్ గ్రిల్‌, ముందువైపు ఎల్ఈడీ లైట్లు, క్రోమ్ గ్రిల్, ఆకర్షణీయమైన అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ అందించారు. ఇక కారు లోపల ఫాక్స్ లెదర్ ఫినిషింగ్‌, కార్బన్ ఫైబర్ డ్యాష్ బోర్డ్, 13 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చారు. ఈ కారు ధర మన దేశంలో దాదాపు 50 లక్షల రూపాయలు ఉండొచ్చని చెబుతున్నారు.


Tags

Related News

PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ప్రధాని మోదీ

Sekhar Basha : మరో వివాదంలో ఆర్జే శేఖర్ బాషా .. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్..

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Big Stories

×