E-Paper
Advertisement

Lord Shiva:-శంఖంలో నీటితో శివుడికి అభిషేకం చేయకూడదా…

Lord Shiva:-శంఖంలో నీటితో శివుడికి అభిషేకం చేయకూడదా…
Advertisement

Lord Shiva:-శివుడు అభిషేక ప్రియుడు. కలశంతో మంచి నీటి అభిషేకం చేసిన పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కోరిన కోర్కెలను నెరవేరుస్తాడు. అలా అని అభిషేకం ఎలా పడితే అలా చేయకూడదు. శివుడిని ఆరాధించేటప్పుడు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అప్పుడే పుణ్యఫలం దక్కుతుంది. తెలిసీతెలియక తప్పులు చేస్తే అభిషేకం చేసిన పుణ్యం కూడా దక్కదు.ఉత్తర దిశను శివుడి ప్రధాన ద్వారంగా భావిస్తారు. కాబట్టి శివ లింగానికి నీటిని అభిషేకించేటప్పుడు ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ముఖం ఉంచాలి. ఈ దిశను అర్ధనారీశ్వరుడి ఎడమవైపుగా భావిస్తారు. ఈ వైపు పార్వతీదేవికి అంకితం చేయబడి ఉంటుంది. కాబట్టి ఈ వైపు నీటిని అభిషేకించడం ద్వారా పార్వతీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

పాలు లేదా నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు రాగి పాత్రను అస్సలు ఉపయోగించకూడదు. రాగితో అభిషేకం చేయడం విషంతో సమానంగా పరిగణిస్తారు. స్టీల్ గిన్నె లేదా మట్టి పాత్రల్లో తీసుకునే అభిషేకించాలి. మహాశివరాత్రి నాడు కొంతమంది పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అలాగే కూర్చొని మాత్రమే అభిషేకం చేయాలి.

Advertisement

పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేసినప్పటికీ.. చివరగా నీటితో అభిషేకం చేయడం చాలా ముఖ్యం. అప్పుడే అభిషేక ఫలితం దక్కుతుంది. నీటితో అభిషేకం చేసేటప్పుడు అందులో పూలు, గంధం వంటివి ఏవీ కలపకూడదు. స్వచ్ఛమైన నీటితోనే అభిషేకం చేయాలి. అలాగే శివుడికి శంఖంలో నీటిని తీసుకుని ఎప్పుడూ అభిషేకించకూడదు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×