Hollywood: వెండితెరపై తమ అసాధారణమైన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించిన సెలబ్రిటీలు.. అనూహ్యంగా మన మధ్య లేరు అనే విషయాన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా వరుస విషాదాలు అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ నటి మృతి చెందడం ఇండస్ట్రీలో మరింత విషాదాన్ని నింపింది. అయితే ఆమె గుండె రక్తనాళం ఉబ్బి ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్‌గా పేరు సొంతం చేసుకున్న కిమ్మరీ జాన్సన్ (Kimmarie Johnson).. గుండె రక్తనాళం ఉబ్బడంతో లాస్ ఏంజిల్స్ లోని సెడార్స్ – సినాయ్ హాస్పిటల్లో కన్నుమూశారు. అక్టోబర్ 27న లాస్ ఏంజెల్స్ లోని తన ఇంట్లో ఆకస్మికంగా గుండె సంబంధిత సమస్య ఏర్పడడంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు. ఆమెకు గుండె అనోరిజం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాతే ఆమె కన్నుమూసింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టి, నటిగా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న కిమ్మరీ జాన్సన్ ఇలా అనారోగ్య సమస్యతో మరణించడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నారు. అటు అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు.
కిమ్మరీ జాన్సన్ మోడల్ గా, వ్యాపారవేత్తగా, అమెరికన్ నటిగా, పేరు సొంతం చేసుకున్న కిమ్మరీ జాన్సన్ అందాల పోటీలలో విజేతగా కూడా నిలిచింది. పెన్సిల్వేనియాలోని పిట్స్ బర్గ్ లో జన్మించిన ఈమె పెన్ వెస్ట్ కాలిఫోర్నియాలో చదువుకుంది. మోడల్ గా మారడానికి ముందు ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన కిమ్మరీ జాన్సన్ 1992లో మిస్ పెన్సిల్వేనియా యూఎస్ఏ టైటిల్ ను సొంతం చేసుకుంది. అలాగే 1993లో మిస్ యూఎస్ఏ అందాల పోటీలలో కూడా పాల్గొని అక్కడ టాప్ 6లో స్థానం సంపాదించుకుంది.
also read: హీరోగా అవతారం ఎత్తిన బిగ్ బాస్ కళ్యాణ్ పడాల.. డైరెక్టర్ ఎవరంటే?
1990ల మధ్యలో లాస్ ఏంజిల్స్ కి మారిన ఈమె.. ఆ తర్వాత మోడలింగ్ నుండి నటన, నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ప్రముఖ టీన్ డ్రామా బెవర్లీ హిల్స్, 90210 ఒక ఎపిసోడ్లో జూడీ అనే పాత్రలో అతిథిగా నటించింది. ఆ తర్వాత డ్యూడ్, వేర్ ఈజ్ మై కార్? వంటి చిత్రాలలో నటించిన ఈమె.. టెలివిజన్ అలాగే చలనచిత్ర రంగాలలో కూడా నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక అలాంటి ఈమె ఇప్పుడు అనారోగ్య సమస్యతో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈమెకు కుమారుడు కామెరాన్ నినో , మేనకోడలు రొండా స్కాట్ కూడా ఉన్నారు.