E-Paper
Advertisement

ఇక్కడ ఇళ్లన్నీ మట్టితోనే కట్టారు.. అయినా వందల ఏళ్లుగా చెక్కుచెదరలేదు!

ఇక్కడ ఇళ్లన్నీ మట్టితోనే కట్టారు.. అయినా వందల ఏళ్లుగా చెక్కుచెదరలేదు!
Advertisement

Mud Cities Of Morocco: ప్రపంచంలో ఎన్నో అందమైన నగరాలు ఉన్నాయి. అయితే, దక్షిణ మొరాకోలోని కొన్ని పురాతన నివాస ప్రాంతాలు మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇక్కడి ఇళ్లు, కోటలు, వీధులు అన్నీ మట్టితోనే నిర్మించారు. ఎరుపు, గోధుమ రంగుల్లో కనిపించే ఈ కట్టడాలు చుట్టుపక్కల కొండల్లో భాగంగా ఉన్నాయా అన్నంత సహజంగా కనిపిస్తాయి. వందల ఏళ్ల క్రితం అందుబాటులో ఉన్న మట్టి, నీరు, గడ్డిని ఉపయోగించి ఇలాంటి అద్భుతాలను సృష్టించారు.

ఐట్ బెన్హద్దూ.. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం

దక్షిణ మొరాకోలోని హై అట్లాస్ పర్వతాల సమీపంలో ఉన్న ఐట్ బెన్హద్దూ (Ait Benhaddou) ఈ మట్టి నిర్మాణాలకు బెస్ట్ ఎగ్జాంఫుల్. దీనిని లోకల్ గా ‘క్సార్’ అని పిలుస్తారు. అంటే.. అనేక కుటుంబాలు కలిసి నివసించే కోటలాంటి గ్రామం. ఇక్కడ ఇళ్లు ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి. చుట్టూ రక్షణ గోడలు, మూలల్లో ఎత్తైన గోపురాలు కనిపిస్తాయి.

Advertisement

ఇలాంటి నిర్మాణాలు కేవలం నివాసాల కోసం మాత్రమే కాకుండా, శత్రువుల దాడుల నుంచి ప్రజలను, వారి ఆస్తులను కాపాడేందుకు కూడా ఉపయోగపడేవి. కస్బా అంటే సాధారణంగా కోటలాంటి వ్యక్తిగత నివాసం అని అర్థం. క్సార్ అనేది పలు కుటుంబాలు నివసించే సమూహ గ్రామంగా చెప్పుకోవచ్చు.

ఎడారి వ్యాపారానికి కీలక కేంద్రం

ఐట్ బెన్హద్దూ ఒకప్పుడు సహారా ఎడారిని మొరాకోలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాలతో కలిపే మార్గంలో ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఈ దారుల గుండా వ్యాపారులు ఉప్పు, వస్త్రాలు, ఇతర విలువైన వస్తువులను రవాణా చేసేవారు. ప్రయాణికులకు ఇక్కడ వసతి, రక్షణ, వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన సౌకర్యాలు లభించేవి.

మట్టితోనే బలమైన నిర్మాణాలు

Advertisement

ఈ ప్రాంతంలోని భవనాలను నిర్మించడానికి మట్టిని నీటితో, అవసరాన్ని బట్టి మొక్కల పీచుతో కలిపేవారు. ఈ మిశ్రమంతో ఎండబెట్టిన మట్టి ఇటుకలను తయారు చేసేవారు. మరో పద్ధతిలో తేమగా ఉన్న మట్టిని ప్రత్యేకమైన అచ్చుల్లో గట్టిగా కుదించి గోడలను నిర్మించేవారు. ఈ విధానాన్ని రామ్డ్ ఎర్త్ అంటారు. ఇక్కడి గోడలు చాలా మందంగా ఉండటం మరో ప్రత్యేకత. పగటిపూట ఎండ వేడిని లోపలికి రాకుండా అడ్డుకోవడంతో పాటు, రాత్రి చల్లదనాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడంలో ఇవి సాయపడుతాయి. అందువల్ల ఎడారి వాతావరణానికి ఈ నిర్మాణాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి.

ప్రకృతికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణం

చాలా ఇళ్లను మధ్యలో ప్రాంగణం ఉండేలా నిర్మించేవారు. దీనివల్ల ఇంట్లోకి సహజమైన వెలుతురు, గాలి అందేవి. అలాగే కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ప్రైవేట్ ప్లేస్ లభించేది. కొన్ని భవనాల పైభాగాల్లో మట్టి ఇటుకలతోనే అందమైన నిర్మాణాలు చేపట్టేవారు. ఈ ప్రాంతంలో నీరు కూడా ఎంతో విలువైనది. వ్యవసాయం, నివాసాల కోసం నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించేవారు. ఖర్జూర చెట్లు, పంట పొలాలు స్థానిక ప్రజల జీవనానికి ఆధారంగా ఉండేవి.

యునెస్కో గుర్తింపు..  

మట్టి నిర్మాణాలకు వర్షం, తేమ ప్రధాన సమస్యలు. కాలక్రమేణా గోడలు దెబ్బతినకుండా ఉండాలంటే తరచూ మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఆధునిక ఇళ్ల నిర్మాణం పెరగడంతో పాత నివాస ప్రాంతాల మెయింటెనెన్స్ కూడా తగ్గింది. ఈ చారిత్రక ప్రదేశం ప్రాముఖ్యతను గుర్తించిన యునెస్కో 1987లో ఐట్ బెన్హద్దూను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. బోలెడు సినిమాలు, టీవీ కార్యక్రమాల్లోనూ ఈ ప్రాంతం కనిపించింది. ప్రస్తుతం పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా లభించే మట్టితో నిర్మించిన మొరాకో పురాతన కట్టడాలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Read Also: లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్.. వామ్మో.. అన్ని మీటర్ల పైనా..

Tags

Related News

పండుగ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి 18 వేల స్పెషల్ రైళ్లు!

చదువు, మేధస్సులో ప్రపంచానికే బాస్‌లు.. టాప్-5 తెలివైన దేశాలు.. భారత్ స్థానం ఎక్కడంటే?

లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్.. వామ్మో.. అన్ని మీటర్ల పైనా..

టాయ్ ట్రైన్‌కు హైడ్రోజన్ ఇంజిన్.. 120 ఏళ్ల రైల్వేకు కొత్త టెక్నాలజీ!

చెక్ ఇన్ ఆలస్యంతో విమానం మిస్.. ఎయిర్‌లైన్‌కు భారీ జరిమానా!

బెంగళూరు-గోవా వందే భారత్ వెరీ స్లో.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

PNR అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దానిలోని అంకెలు దేనికి సంకేతం?

Big Stories

Advertisement
×