BigTV English

Nandamuri Balakrishna: చిరు సినిమాను ఫ‌స్ట్ చూడ‌కూడ‌దా? బాల‌కృష్ణ ఉద్దేశ‌మేంటి?

Nandamuri Balakrishna: చిరు సినిమాను ఫ‌స్ట్ చూడ‌కూడ‌దా? బాల‌కృష్ణ ఉద్దేశ‌మేంటి?

Nandamuri Balakrishna:2023 సంక్రాంతికి ఇద్ద‌రు బిగ్ స్టార్స్ తెలుగులో పోటీప‌డుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అండ్ నంద‌మూరి అంద‌గాడు బాల‌కృష్ణ‌. వీరిద్ద‌రి సినిమాలూ నిర్మిస్తున్న‌ది మైత్రీ సంస్థ‌.చిరంజీవి హీరోగా బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది వాల్తేరు వీర‌య్య‌. పైన తుఫాను, కింద సంద్రం, ప‌ది రోజుల పాటు ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ చేస్తే డూప్ లేకుండా చేశారు చిరంజీవి. సినిమా మొత్తానికి హైలైట్ సీన్ అదే. జ‌నాల‌ను థియేట‌ర్ల‌లో కూర్చోపెట్టేసే సీన్‌. రాసిపెట్టుకోండి హిట్ గ్యారంటీ అని అన్నారు డైర‌క్ట‌ర్‌. అదే కాన్ఫిడెన్స్ క‌నిపిస్తోంది చిరంజీవిలోనూ.


ఇటు బాల‌కృష్ణ కూడా మామూలు హైప్‌లో లేరు. అస‌లే రెడ్డి పేరుంటే సినిమా హిట్ గ్యారంటీ. పైగా ఈ సారి సింహా కూడా క‌లిసింది. డ‌బుల్ హిట్ గ్యారంటీ. మాస్ ఎలివేష‌న్స్ మ‌రో రేంజ్‌లో ఉంటాయి. త‌మ‌న్ సాంగ్స్ కి ఫ్యాన్స్ కి ఇప్ప‌టికే పూన‌కాలు వ‌చ్చేస్తున్నాయి. సంక్రాంతిలో పందెంకోడి మ‌న‌మే అంటున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. పండ‌గ సినిమాలు స‌క్సెస్ చేయ‌డం మ‌న‌కేం కొత్త కాదంటున్నారు డైరక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని.

ఇద్ద‌రికి ఇద్ద‌రూ వీర లెవ‌ల్లో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇద్ద‌రి కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ చూసిన వారికి గ‌తం గుర్తుకు వ‌స్తోంది. పాతికేళ్ల క్రితం నంద‌మూరి బాల‌కృష్ణ పెద్ద‌న్న‌య్య‌, చిరంజీవి హిట్ల‌ర్ సినిమాలు సంక్రాంతికి వ‌చ్చాయి. రెండూ క్లిక్ అయ్యాయి.
ఎక్క‌డిదాకో ఎందుకు కొన్నేళ్ల క్రితం చిరంజీవి క‌మ్ బ్యాక్ సినిమా ఖైదీ నెంబ‌ర్‌కీ, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి క్లాష్ అయింది. రెండూ క్లిక్ అయ్యాయి. ఈ సారి కూడా అలాంటి పాజిటివ్ రిజ‌ల్టే వ‌స్తుంది రాసిపెట్టుకోండి అని చిరంజీవి అంటుంటే, ఇదిగో చ‌ర‌ణ్ సంక్రాంతికి ముందు నువ్వు నా సినిమా చూడు. త‌ర్వాత మీ నాన్న‌గారి సినిమా చూడు అంటున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. స‌ర‌దాగా అన్నా, ముందు త‌న సినిమా చూడ‌మ‌ని జ‌నాల‌ను ఇన్‌సిస్ట్ చేస్తున్నారు బాల‌య్య‌. అలాంటి మాట‌లు ఇప్ప‌టిదాకా చిరు నుంచి అయితే రాలేదు మ‌రి.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×