Big Stories

Sri Mogileeswara Swamy : కంచి, కాళహస్తి తర్వాత మళ్లీ అక్కడే……

- Advertisement -

Sri Mogileeswara Swamy : తనను కొలిచే భక్తులపై శివుడికి అమితమైన ప్రేమ ఉంటుంది అందుకు నిదర్శనమే చిత్తూరులోని మొగిలీశ్వరాలయం. భక్తుడి పేరు పూజలందుకుంటున్న శివయ్యకు ఇక్కడ మనం దర్శించవచ్చు. నీలకంఠుడు,గంగాధరుడు, త్రినేత్రుడు ఇలాంటి పేర్లన్నీ శివుడివే. కాని మొగిలీశ్వరంలో మాత్రం ఇందుకు భిన్నంగా భక్తుడి పేరుతో ఆలయం ప్రసిద్ధి చెందింది. మొగిలీశ్వరుడ్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే కోరిన కోరికల నెరవేరుతాయన్న విశ్వాసం ప్రగాఢంగా ఉంది. అందుకే భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ స్వామిని ఆరాధిస్తుంటారు.

- Advertisement -

మొగిలి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన త్రిశూల తీర్థం ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపాలురతో కలిసి గోవుల్ని మేపుతూ ఈ ప్రాంతంలోనే సంచరించాడట. ఒకసారి కరువు రావడంతో ఈ ప్రాంతమంతా ఎండిపోగా..పరమేశ్వరుడ్ని ప్రార్ధించడంతో శివుడి కరుణతో పాతాళగంగ పైకి వచ్చింది. త్రిశూల్ని నేలకు గుచ్చి నీళ్లకు తేవడంతో ఈ ప్రాంతానికి త్రిశూల తీర్థమని పేరు వచ్చింది. మొగిలీశ్వరాలయానికి దగ్గరల్లోనే విభూతి కొండ ఉంది. సహజంగా ఏర్పడిన విభూతి కొండ నుంచి విభూతితోనే స్వామిని అభిషేకిస్తూ ఉంటారు. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. పురాణాల ప్రకారం జమదగ్ని మహర్షి పౌండరీకం అనే యాగాన్ని ఇక్కడే నిర్వహించాడట. దానికి సంబంధించిన యాగ సమిధల భస్మాన్ని పెద్ద రాశిగా పోయడంతోనే ఈ కొండ ఏర్పడిందని స్థానికులు చెబుతారు.

ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత బంగారు బల్లి. ఆలయ పైకప్పుమీద దర్శనమిస్తుంది. కంచి, శ్రీకాళహస్తిలలో మాత్రమే కనిపించే బంగారు బల్లిని ఇక్కడ కూడా దర్శించవచ్చు. బంగారు బల్లితోపాటు చంద్రుణ్ణి మింగడానికి వస్తున్న రాహువుని కూడా చూడొచ్చు. వీటిని తాకితే సర్పదోషాలతోపాటు అన్ని దోషాలూ నశిస్తాయని భక్తుల నమ్మకం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News