Big Stories

Types of Tirdham : తీర్థాల్లో నాలుగు రకాలు ఎందుకు

- Advertisement -

Types of Tirdham : హిందూ ఆలయాల్లో గుడికి వెళ్లినప్పుడు తీర్ధం, ప్రసాదం రెండూ తప్పనిసరి. దైవ దర్శనం తర్వాత ప్రతీ ఒక్కరూ గుడిలో పూజారి ఇచ్చే తీర్ధాన్నీతీసుకుంటారు. గుడిలో ఇచ్చే తీర్ధాన్ని ఒకసారి కాదు మూడుసార్లు తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. మూడు సార్లే ఎందుకు తీసుకోవాలంటే పురాణాల ప్రకారం అలా చేయడం వల్ల భోజనం చేసినంత శక్తి కలుగుతుంది. ఆలయాల్లో మెట్లెక్కి లోపలి ఆయాస పడుతూ వచ్చిన వారికి గొంతు లోపలకి వెళ్తే తీర్థం అమృతంలా పనిచేసి ఒక్కసారిగా శక్తిని అందిస్తుంది. అందుకే తీర్థం తీసుకోగానే ఒంట్లో ఒకరకమైన ఎనర్జీ వస్తుంది. ఇంత మహత్తరమైన తీర్థంలో నాలుగు రకాల ఉన్నాయి. జలతీర్థం, కషాయ తీర్థం, పంచామృత అభిషేక తీర్థం, పానక తీర్థం అని నాలుగు రకాలు ఉన్నాయి.

- Advertisement -

Jala Tirdham : జల తీర్ధం
జలతీర్థం స్వీకరించడం వల్ల పూజారి చెప్పినట్టు అకాలమరణం నివారించబడుతుంది . కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది . సర్వరోగాలు హరించబడతాయి . బుద్ధి ధర్మమార్పు చెందిన చక్కని సత్యమార్గంలో వ్యక్తి ప్రయాణించే అవకాశం ఉంటుంది .

Kashay Tirdham :కషాయ తీర్ధం
కొల్లాపూర్ శ్రీమహాలక్ష్మిదేవాలయం, కొల్లూరు ముకాంబిక దేవాలయం,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం ,శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు. రాత్రి పూజ తరువాత తీర్థాన్ని కషాయం రూపంలో పంచుతారు. ఈ తీర్థాన్ని తీసుకుంటే అంతర్లీనంగా ఉన్న రోగాలు కూడా కాలక్రమంలో నయమవుతాయి.

Panchamrita Abhisheka Tirdham : పంచామృత అభిషేక తీర్థం
పంచామృత తీర్థం తీసుకుంటే అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అని శాస్త్రవచనం.

Panaka Tirdham :పానక తీర్ధం
శ్రీ మంగళగిరి నరసింహస్వామితోపాటు, అహోబిలం నారసింహ స్వామికి పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దేవుడికి అర్పించిన పానక తీర్ధాన్ని సేవిస్తే, శరీరంలో ఉత్సాహం పెరిగి, భగవానుగ్రహముతో కొత్త చైతన్యం కలుగుతుంది. ఒంట్లో వేడి సమ స్థితికి చేరుకునే విధంగా ఉపయోగపడుతుంది.నీరసం పోతుంది. రక్తపోటు, తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు. రుమాటిజం, బోన్స్ కి వ్యాధులు నయమవుతాయి. .పానకం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. జీవితంలో శత్రువుల బాధ ఉండదు. బుద్ధి చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News