Big Stories

Parliament : పార్లమెంట్ సభ్యుల సంఖ్య వెయ్యి దాటుతుందా..? మోదీ ఇచ్చిన సంకేతాలేంటి..?

Parliament : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ప్రధాని కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ లో సీట్ల సంఖ్య పెంపుపై మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతాయని ప్రధాని వెల్లడించారు. 2026 తర్వాత జరిగే జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ఎంపీల సంఖ్య పెరగాల్సి ఉందన్నారు. పాత పార్లమెంట్‌లో కొత్త ఎంపీలకు కూర్చునేందుకు తగినంత స్థలం లేదన్నారు. అందుకే కొత్త పార్లమెంట్‌ను అతితక్కువ సమయంలోనే వేగంగా నిర్మించామని చెప్పారు.

- Advertisement -

పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోక్ సభలో సీట్ల సంఖ్యను పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని చర్చ నడుస్తోంది. నిబంధనల ప్రకారం పార్లమెంట్ స్థానాల సంఖ్య 2026 తర్వాత కచ్చితంగా పెంచాల్సిన ఉంది.

- Advertisement -

మోదీ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో 2026 కంటే ముందే పార్లమెంట్ సీట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది. రాజ్యాంగ సవరణ ద్వారా సీట్లు పెంచే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చేపట్టడం పెద్ద కష్టమైన పనేమి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంటే సీట్ల పెంపు 2026 కంటే ముందే సాధ్యమనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ స్థానాలను పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నోటి వెంట పార్లమెంట్ సీట్ల పెంపు అంశం ప్రస్తావనకు రావడంతో కేంద్రం ఆ దిశగా ఆలోచన చేస్తోందని బలమైన సంకేతాలు వెలువడ్డాయి.

ప్రస్తుతం పార్లమెంట్ లో మొత్తం సభ్యుల సంఖ్య 788 . అందులో లోక్ సభ సభ్యుల సంఖ్య 543 కాగా.. రాజ్యసభ సభ్యల సంఖ్య 245 . పాత పార్లమెంట్ భవనంలో లోక్‌సభలో 545 మంది, రాజ్యసభలో 250 మంది సభ్యులు కూర్చునే సీటింగ్ కెపాసిటీ ఉండేది. అంటే పాత పార్లమెంట్ భవనం సీటింగ్ కెపాసిటీ 795 .

కొత్త పార్లమెంట్ భవనాన్ని అన్ని హంగులతో 1272 మంది కూర్చునే కెపాసిటీతో నిర్మించారు. కొత్త భవనంలో లోక్‌సభలో 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునేలా సీటింట్ కెపాసిటీని ఏర్పాటు చేశారు. పాత భవనంతో పోలిస్తే లోకసభలో కెపాసిటీ 343 , రాజ్యసభ కెపాసిటీ 134 పెరిగింది. అంటే ఆ మేరకు సీట్లను పెంచాలని కేంద్రం యోచిస్తోందా? సీట్ల సంఖ్య పెంపునకు అనుగుణంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించిందా..? ఈ అంశాలపై ప్రధాని మోదీ త్వరలోనే క్లారిటీ ఇస్తారా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News