Big Stories

Sri Venkateswara Swamy : శ్రీవారి గడ్డానికి వెన్న రాయడంలో ఆంతర్యమిదే!

Sri Venkateswara Swamy : తిరుమలలో ప్రతి అడుగు ఒక చరిత్ర. స్వామి దేవాలయంలో ప్రతి అడుగు వెనుక ఎంతో విశిష్టత. స్వామి ఆర్చితామూర్తి రూపంలో ఎన్నో గాథలు.. విశేషాలు, వింతలు ఉన్నాయి. వెంకటేశ్వరస్వామి ఎంత ప్రసిద్ధి చెందిన దైవమో అందరికీ తెలిసిందే. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా చాలవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం వెన్నెందుకు రాస్తారో అది ఎందుకో తెలుసా…

- Advertisement -

భృగుమహర్షి వల్ల శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ చేరుకుంటుంది. ఆపై శ్రీ మహా విష్ణువు నరుడి అవతారాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చేయగా ఆయన చుట్టూ పెద్ద పుట్ట వెలుస్తుంది. గోమందంలోని కామధేనువు స్వామి వారికి నైవేద్యంగా పుట్టలో పాలధారను కార్చి ఆ స్వామి ఆకలి తీర్చేది. కొన్ని రోజులు దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవు తలపై కొట్టగా నారాయణుడు ఆ దెబ్బను అడ్డుకుని తాను భరిస్తాడు.

- Advertisement -

ఆ దెబ్బ స్వామికి గడ్డం కింద తగులుతుంది దానికి ప్రతీకగానే స్వామి వారికి నిత్యం గడ్డం కింద వెన్న పూస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News