IPL 2026: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో 10 జట్లలో కీలక మార్పులు జరగనున్నాయి. ఈసారి మినీ వేలం అలాగే ట్రేడ్ ఆప్షన్ ఉంటుంది. దీంతో ఒక జట్టులో ఉన్న ప్లేయర్ మరో జట్టులోకి వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు (Sunrisers Hyderabad) ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. SRH జట్టు నుంచి డేంజర్ ఆటగాడు బయటకు వెళ్తున్నాడట. ఓపెనర్ గా విధ్వంసం సృష్టించే అభిషేక్ శర్మ ( Abhishek Sharma).. హైదరాబాద్ జట్టును వీడి ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: Womens World Cup 2025: 1973 నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన జట్లు ఇవే..టీమిండియా ఒక్కటి కూడా లేదా ?
సన్రైజర్స్ జట్టు పేరు వినగానే అందరికీ అభిషేక్ శర్మతో పాటు హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ మాత్రమే గుర్తుకువస్తుంది. అయితే ఈ జంట త్వరలో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రేడ్ ఆప్షన్ ద్వారా సన్రైజర్స్ జట్టు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ లోకి అభిషేక్ శర్మ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయట. 2018 సమయంలో ట్రేడ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న అభిషేక్ శర్మను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ట్రేడ్ ద్వారా హైదరాబాద్ జట్టును ఆదుకుంటున్న అభిషేక్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వెళ్తున్నాడట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అభిషేక్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వెళ్తే ట్రావిస్ హెడ్ ఒంటరి వాడవుతాడు. దీంతో హెడ్ ( Travis Head ) బ్యాటింగ్ లైనప్ కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది. అయితే అభిషేక్ శర్మ ఢిల్లీలోకి వెళితే, హైదరాబాద్ జట్టు ఓపెనర్ గా కాటేరమ్మ కొడుకు క్లాసెన్ బరిలోకి దిగుతాడని అంటున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPl 2026) కంటే ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. మినీ వేలం అలాగే ట్రేడ్ కారణంగా కొంతమంది ప్లేయర్లు సన్రైజర్స్ జట్టును వదిలి వెళ్తారని చర్చ మొదలైంది. ఈ లిస్టులో అభిషేక్ శర్మ కూడా చేరిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. మహమ్మద్ షమీని కూడా కావ్య పాప వదిలేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇశాన్ కిషన్, అడమ్ జంపా, రాహుల్ చాహర్, లాంటి ప్లేయర్లను కూడా వదిలేసేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం సిద్ధమైంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. కాగా ముంబై వేదికగా డిసెంబర్ మాసంలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. డిసెంబర్ 15వ తేదీన ఈ వేలం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2018 trade from delhi Capitals to Sunrisers Hyderabad
2025 trade from Sunrisers Hyderabad to Delhi Capitals ??
Kisko pta hai jisko pta hai usko pta hai pic.twitter.com/wjdBjzhEtU
— Sawai96 (@Aspirant_9457) October 31, 2025