Unwanted Hair : ప్రస్తుత కాలంలో మహిళలను వేధిస్తున్న సమస్య అవాంఛిత రోమాలు. ఈ అవాంఛిత రోమాల వల్ల ముఖం అందవికారంగా కనిపిస్తుంటుంది. వయసు పెరిగేకొద్దీ ఈ రోమాలు కూడా ఎక్కువ అవుతాయి. మెడికల్ భాషలో చెప్పాలంటే వీటిని హిర్సుటిస్మ్ అని పిలుస్తారు. అయితే చిన్న చిట్కాలు పాటిస్తే వీటిని పూర్తిగా తొలగించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ముందుగా పాలలో పసుపు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేసినట్లైతే రోమాలన్నీ తొలగిపోతాయి. ఒక అరటిపండు గజ్జు, రెండు స్పూన్ల ఓట్ మీల్ కలిపి ముఖానికి పట్టించాలి, కాసేపు మర్దనా చేసుకోవాలి. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనెను కానీ ఈ అవాంఛిత రోమాలపై రాసి మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తటి శెనగపిండి రాసి నలుగులా పెట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల రోమాలు పోతాయి. స్నానం చేసేటప్పుడు ఫేస్‌కు పసుపు రాసి కడుక్కుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. కోడిగుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ మొక్కజొన్న పొడి కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత నీళ్లతో కడిగితే అవాంఛిత రోమాలు తొందరగా పోతాయి. పసుపు, శెనగపిండి రెంటిని సమపాళ్లలో కలిపి ముఖానికి పెట్టుకుని తర్వాత కడుక్కుంటే రోమాల పెరుగుదలను ఆపవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండేలా చూస్తే అసలు ఈ హార్మోన్ల సమస్యే రాదంటున్నారు. మన ఆహారంలో అవిశ గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, సోయా, వెల్లుల్లి, ఎండు ఖర్జూర ఉండేలా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు.