E-Paper
Advertisement

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పై నేడే సుప్రీం కోర్టు తీర్పు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తన అరెస్టుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం, జూలై 12న తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరిస్తుందని.. కోర్టు వెబ్ సైట్ పై ప్రకటన చేయబడింది.

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పై నేడే సుప్రీం కోర్టు తీర్పు
Advertisement

Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తన అరెస్టుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం, జూలై 12న తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరిస్తుందని.. కోర్టు వెబ్ సైట్ పై ప్రకటన చేయబడింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21, 2024న అరెస్టు చేసింది. అయితే తనను ఈడీ అరెస్టు చేయడం.. చట్ట వ్యతిరేకమని చెబుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. కానీ హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించడంతో.. కేజ్రీవాల్.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఏప్రిల్ 9, 2024న సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.

Advertisement

ఈ కేసులో ఇరు పక్షాల వాదన విన్న తరువాత మే 17, 2024న జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Also Read: మాజీ అగ్నివీర్ జవాన్లకు పారామిలిటరీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్!

Advertisement

మరోవైపు కేజ్రీవాల్ ఈ కేసులో బెయిల్ కోరుతూ ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. జూన్ 20, 2024న ట్రయల్ కోర్టు లక్ష రూపాయల పూచీకత్తుపై కేజ్రీవాల్ కు బెయిల్ ముంజూరు చేసింది. కానీ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడంపై ఈడీ అధికారులు మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టులో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేశారు.

జూన్ 25న కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో ఆయన ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారు.

Also Read:  జైలులో నటుడు దర్శన్‌కు కష్టాలు, పవిత్రగౌడ కంటతడి..

ఆ తరువాత సిబిఐ అధికారులు.. కేజ్రీవాల్ ను జూన్ 26న ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలు చేస్తూ.. తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్ , ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2021-22లో రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. కానీ ఈ పాలసీ ద్వారా కేజ్రీవాల్, ఇతర మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఢిల్లీ గవర్నర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×