BigTV English

Jaya Prada: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు బిగ్ రిలీఫ్..నిర్దోషిగా ప్రకటన!

Jaya Prada: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు బిగ్ రిలీఫ్..నిర్దోషిగా ప్రకటన!

Jaya Prada Acquitted Poll Code Violation Case: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు బిగ్ రిలీఫ్ లభించింది. ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో జయప్రదకు భారీ ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్ కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.


2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ చేతితో ఓటమి చెందారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రచార సమయంలో ప్రత్యర్థి ఆజం ఖాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆమెపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేశారంటూ జయప్రదపై కేసు నమోదు కావడంతో విచారణకు హాజరుకావాలని ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధులు న్యాయస్తానం ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది అమర్ నాథ్ తివారీ వెల్లడించారు.


ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించిన సమయంలో ఆమె కోర్టులోనే ఉన్నట్లు వెల్లడించారు. కోర్టు తుది తీర్పు వెల్లడించిన అనంతరం జయప్రద మీడియాతో మాట్లాడారు. రామ్ పూర్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందినట్లు తెలిపారు. తాను ఎప్పుడూ ఇక్కడే ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రజా జీవితంలో తాన ఎప్పుడూ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు.

Also Read: నాలుగు దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న ‘పూరీ’ రత్నభాండాగారం

ఇదిలా ఉండగా, జయప్రద 2004, 2009 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థఇగా రామ్ పూర్ నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×