E-Paper
Advertisement

Top 20 News Today: ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు, ఇంటర్ విద్యార్థి సూసైడ్

Top 20 News Today: ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు, ఇంటర్ విద్యార్థి సూసైడ్

1. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భారీ నిధులు..

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భారీ నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. కేబినెట్ ఆమోదం తర్వాత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమకానున్నాయి. దీని కోసం హడ్కో ద్వారా నిధులు సమీకరించింది ప్రభుత్వం. GHMC, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో దశల వారీగా ఇళ్లను నిర్మించనున్నారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 1.48 లక్షల ఇళ్ల నిర్మిస్తారు.

2. ప్రధాని, ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాల లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

ప్రధాని, ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాల లీకులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకులు ఇచ్చిన వ్యక్తులు మెంటలోళ్లు అని మండిపడ్డారు. మీటింగ్‌లో జరిగిన విషయాలు బయట చెప్పొద్దని ప్రధాని చెప్పారన్నారు. అయినా కూడా మీటింగ్‌లో జరిగిన విషయాలను బయటకి చెప్పారని మండిపడ్డారు.

3. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారేమోనని డౌటు-హనుమంతరావు

కాంగ్రెస్ సీనియర్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారేమోనని డౌటుందన్నారు. రాష్ట్రం సంగతి తనకు తెలీదుకానీ.. మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులున్నట్టు చెప్పారు. ఈ కోవర్ట్ సిస్టమ్ లేకుంటే అన్ని స్థానాల్లో తామే గెలిచేవారమని తెలిపారు. ఈ కోవర్టులు బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతేగానీ కాంగ్రెస్ బాగుపడదని చెప్పారు.

4. రాహుల్ గాంధీని చూస్తుంటే బీజేపీకి భయం

రాహుల్ గాంధీని చూస్తుంటే బీజేపీకి భయం పట్టుకుందని.. కిషన్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతోందన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్. బ్రిటిష్ వారికే భయపడని కాంగ్రెస్.. వారి వారసులైన బీజేపీకి భయపడదన్నారు. గాంధీ, నెహ్రూలపై విషప్రచారం చేస్తున్న బీజేపీకి తప్పకుండా శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.

5. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్

కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందన్నారు మాజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి. న్యాయస్థానంలో ఊరట లభించినా.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీపురంలో బాధిత కుటుంబాలను పరామర్శించి మాట్లాడారు. 25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల లబ్ధి కోసం ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయని అన్నారు.

6. ఇంటర్ విద్యార్థి సూసైడ్

హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని విషాదం చోటు చేసుకుంది. ఇగ్నైట్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకేతన్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే కాలేజీ యాజమాన్యం మృతదేహాన్ని తరలించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

7. ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు

ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో బిల్డింగ్ డివిజన్ డిఈ శ్రీనివాస్.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపును క్లియర్ చేయడానికి శ్రీనివాస్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

8. ఆంజనేయ స్వామి ఆలయంలో కుట్ర

అనంతపురం దుర్గా ఆంజనేయస్వామి ఆలయంలో గుప్త నిధుల పేరుతో కుట్ర జరుగుతోందని ఆరోపించారు వైసీపీ శింగనమల ఇంచార్జి శైలజానాథ్. కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్న పూజారికి మద్దతు తెలిపారు. 150 ఏళ్లుగా సేవ చేస్తున్న పూజారిపై దాడి యత్నాన్ని ఖండించారు. దేవాలయాలపై రాజకీయ ఒత్తిడి తగదని హితవు పలికారు.

9. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లి, కొడుకు మృతి

కాకినాడ జిల్లా గండేపల్లి వద్ద 16వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తల్లి, కొడుకు మృతి చెందారు. మృతులు ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామానికి చెందిన తోర్లపాటి తులసి, కుమార్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

10. బాపట్ల జిల్లా క్షుద్రపూజలు కలకలం

బాపట్ల జిల్లా ఉప్పుటూరు బ్రిడ్జిపై క్షుద్రపూజలు కలకలం రేపాయి. పర్చూరు నుంచి బాపట్ల వెళ్లే మార్గంలో దుండగులు కోడిగుడ్లు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో క్షుద్రపూజలు చేశారు. పర్చూరు తహసిల్దార్ కార్యాలయం, ఐసిడిఎస్ కార్యాలయాలకు దగ్గరలో ఈ ఘటన జరిగింది. క్షుద్రపూజలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

11. జగన్ బంధువుకు నోటీసులు

వైసీపీ అధినేత జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు కృష్ణాజిల్లా గుడివాడ పోలీసులు. సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో వ్యాప్తి చేసిన కేసులో అర్జున్ నిందితుడు. గతంలో విదేశాలకు పారిపోయిన అర్జున్ తిరిగిరాగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఏపీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని సీఆర్‌పీసీ సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చారు.

12. కోఠిలోని మహిళా వర్సిటీలో మరో వివాదం

కోఠిలోని మహిళా వర్సిటీలో మరో వివాదం రాజుకుంది. యూనివర్సిటీలో సినిమా షూటింగ్‌లు వద్దంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. షూటింగ్ జరిగే సమయంలో విద్యార్థినులను.. సినిమా సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్‌వాన్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

13. నిజామాబాద్ జిల్లాలో కాల్పులు కలకలం..

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో కాల్పుల కలకలం రేగింది. దేవితండా వద్ద లారీ డ్రైవర్‌ సల్మాన్‌పై కాల్పులు జరిపారు దుండగులు. మరో లారీలో వచ్చిన ముగ్గురు దుండగులు పిస్టల్‌తో కాల్చిన తర్వాత లారీలో పరారీ అయ్యారు. సల్మాన్ ను ఇందల్వాయి హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

14. గీతం యూనివర్సిటీపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ గీతం యూనివర్సిటీ 118 కోట్ల విద్యుత్ బకాయిలు పడటంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలపై TGSPDCL నోటీసులు ఇవ్వడంతో కోర్టును ఆశ్రయించింది యూనివర్సిటీ యాజమాన్యం. విచారణలో సామాన్యుల కరెంట్ వెంటనే కట్ చేసే అధికారులు, వర్సిటీకి ఎందుకు వెసులుబాటు ఇచ్చారని ప్రశ్నించింది. నోటీసులపై వివరణ ఇవ్వాలని TGSPDCL అధికారులను ఆదేశించింది.

15. దారుణం.. మత్తు పదార్థాలు వద్దన్నందుకు వ్యక్తిపై దాడి..

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరులో దారుణం జరిగింది. మద్యం, మత్తు పదార్థాలు వద్దని మందలించినందుకు పోచయ్య అనే వ్యక్తిపై రాకేష్ గౌడ్ అనే వ్యక్తి, అతని అనుచరులు దాడి చేశారు. బాధితుడి ఇంటిని కూడా ధ్వంసం చేశారు. సర్పంచ్ అభ్యర్థిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. పాత కక్షలతోనే నిందితులు దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు.

16. విజయ్ సభకు అనుమతి

తమిళనాడులోని ఈరోడ్ ఈ నెల 18న తమ పార్టీ అధినేత విజయ్ సభ నిర్వహణకు TVK చేసిన వినతికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఈ సభకు ఏకంగా 84 షరతులను విధించారు. రూ.50 వేలు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నారు. శాంతి భద్రతలు, జన సమూహాన్ని నియంత్రించడం, కార్యక్రమ వేదిక నిర్యహణతో పాటు, ఈ వెంట్ తర్వాత ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయాలనే నిబంధనలు కూడా విధించారు.

17. దేవుళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారని సుప్రీం ఆగ్రహం..

శ్రీమంతులైన భక్తులు సమర్పించే విలువైన కానుకల కోసం దేవుళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యేక పూజల పేరుతో ధనవంతులైన భక్తులను విరామ సమయాల్లో ఆలయాల్లోకి అనుమతించడంపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలీ ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.

18. భారత్‌కు లూథ్రా సోదరులు

గోవా నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో నిందితులైన లూథ్రా సోదరులను థాయ్‌లాండ్‌ పోలీసులు భారత్‌కు అప్పగించారు. ఇండిగో విమానంలో ఢిల్లీకి చేరుకున్న వీరిని ఢిల్లీ, గోవా పోలీసుల సంయుక్త బృందం కస్టడీలోకి తీసుకుంది. విచారణ కోసం ట్రాన్సిట్ రిమాండ్‌పై గోవాకు తీసుకెళ్లనున్నారు.

19. ఓజీ డైరెక్టర్ సుజిత్‌కు పవన్ గిప్ట్..

ఓజీ డైరెక్టర్ సుజిత్‌కు పవన్ కళ్యాణ్ రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్‌గా ఇచ్చారు. పవన్ కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లోకి చేరేంతగా ఈ మూవీ హిట్ కావడంతో సుజిత్‌కి కారు బహుమతిగా ఇచ్చారు పవన్. ఈ కారు తీసుకున్న క్షణాలు తన జీవితంలో అపూర్వమైనవన్నారు సుజిత్.

20. యాషెస్ సిరీస్‌‌కు దూరం

గాయం కారణంగా ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. టెస్టుల్లో తరచూ గాయాలపాలవుతుండటంతో, అతని కెరీర్‌పై ప్రభావం పడుతోంది. ఫిట్‌నెస్ దృష్ట్యా, టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేలు, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారిస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×