E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నిజం చెప్పిన నర్మద.. అడ్డంగా ఇరుక్కున్న తిరుపతి..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నిజం చెప్పిన నర్మద.. అడ్డంగా ఇరుక్కున్న తిరుపతి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి ప్రవర్తన చూస్తే ఇంకాస్త అనుమానం పెరుగుతుంది. దాంతో కచ్చితంగా శ్రీవల్లిని తీసింది అని ఆ ఇద్దరు కన్ఫర్మ్ చేసుకుంటారు. శ్రీవల్లి మాత్రం అక్కడి నుంచి మెల్లగా జారుకుని తన రూమ్ లోకి వెళుతుంది.. భాగ్యం ప్లాన్ వర్కౌట్ అయ్యిందని సంతోషపడతారు. ఇంట్లో పూజ పెట్టగానే అతని ఇంటి అలా పూజ చేస్తున్నాడు అనేసి వేదవతి అంటుంది. నగలనే బయటకు తీసుకొచ్చేందుకు పూజ చేస్తున్నారు ఆగండి మీకే తెలుస్తుంది అనేసి నర్మద అంటుంది. ప్రసాద్ రాగానే వింత వింతగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. శ్రీవల్లి అక్కడికి వచ్చి ఎవరితను.. బయట వేరు మొక్కలు అమ్మేలా ఉన్నాడు అనేసి అంటుంది.

అతను నగలు ఇంట్లో పోయాయి కదా వాటికోసమే ఈయన వచ్చాడు.. ఈయన చేసే పూజకి దొంగ ఎక్కడున్నా సరే బయటపడపోతారు అనేసి నర్మద అనగానే శ్రీవల్లి ముఖంలో రంగులు మారతాయి. కొంపతీసి అతను నా గురించి బయట పెడతారా ఏంటి అని టెన్షన్ పడుతుంది.. ఇక అక్కడ పూజ పెట్టిన అతను ఇంట్లో ఉన్న బంగారాన్ని మొత్తాన్ని ఇందులో వేయాలని చెప్తాడు.. మిగిలిన నగలు ఆకులు అవుతాయని చెప్పగానే శ్రీవల్లి షాక్ అవుతుంది… అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లి టెన్షన్ పడుతూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది.. అమ్మద ఉంగరము ఆకైందమ్మ ఇప్పుడు నగలు కూడా ఆకలు అయితాయేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక పని చెయ్. నువ్వు వెళ్లి ఆ నగలు ఆకులయ్యేమో చూసి మళ్ళీ అందులోనే దాచి పెట్టేసేయని భాగ్యం సలహా ఇస్తుంది.. శ్రీవల్లి వెళ్లి ఆ నగలను చూసి నగలన్నీ బాగానే ఉన్నాయని మురిసిపోతూ ఉంటుంది. ఎదురుగా నర్మదా ప్రేమను చూసి షాక్ అవుతుంది.. నగలను తీసింది నువ్వే అని మాకు తెలుసు.. నీ అంతటి నువ్వే బయటపడాలని మేము ఒకతని తీసుకొచ్చాము. అతను బాబా కాదు అని నర్మదా అంటుంది. ఎంత మోసం చేశావు నగలను నీ దగ్గర పెట్టుకొని అందరినీ తిట్టేలా చేస్తావా అని ప్రేమ సీరియస్ అవుతుంది.

ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ధీరజ్ ప్రేమ ఇద్దరే నగలను మాయం చేశారని మా మీద వేస్తావా.. నీకు కొంచమైన బుద్ధుందా అని ప్రేమ రెచ్చిపోతుంది. నీకు సిగ్గు అనిపించలేదా అవతలి వాళ్ళ నగలను కొట్టేసి ఇలా నాటకాలు ఆడటానికి.. ఛీ ఏం బ్రతుకు నీది అని ప్రేమ శ్రీవల్లిని దారుణంగా తిట్టేస్తుంది. మా అమ్మ పెట్టిన నగలు రోల్డ్ గోల్డ్ అని మీకు తెలుస్తాయని నీ నగలను తీసేయమని చెప్పింది.. అందుకే నీ నగలను నేను కొట్టేసాను అని నిజం చెప్పేస్తుంది శ్రీవల్లి.. నగలు మార్చడం దగ్గరనుంచి ప్రతిదీ నిజం చెప్తుంది.

Advertisement

ఈ నగలను కచ్చితంగా మామయ్య గారికి చూపించి నువ్వే తీసావని చెప్తామని ప్రేమ నర్మద ఇద్దరూ ఆవేశంగా వెళ్తారు.. శ్రీవల్లి మాత్రం మీ సొంత అక్క లాంటిదని అనుకోండి నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతుంది కాళ్లు పట్టుకుంటుంది.. అయినా కూడా ప్రేమ నర్మద ఇద్దరు కరగరు. నాకు నా భర్త అంటే ప్రాణం అతని కోసమే నేను ఇలా ఉన్నాను. నిజం చెప్తే మామయ్య వాళ్ళు నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. తర్వాత నేను చచ్చిపోతాను. ఈ నగలను తీసుకొని మామయ్య దగ్గరికి వెళ్ళే లోపల నేను ఇది తాగి చచ్చిపోతాను అని అంటుంది.. చూసావా అక్క బ్లాక్మెయిల్ చేస్తుంది.. నువ్వు ఎన్ని చేసుకున్నా ఏం పర్లేదు ఇవాళ నీ గురించి బయట పెట్టాల్సిందే అని ప్రేమ అంటుంది..

Also Read : కమల్ ను రెచ్చగొట్టిన పల్లవి.. మీనాక్షి కోసం అక్షయ్ కీలక నిర్ణయం.. భానుమతికి కమల్ ఝలక్..

కానీ శ్రీవల్లి మాత్రం చెప్పింది నిజమే అని నర్మదా నమ్ముతుంది.. ఈ నగలను ఎలా నువ్వు మావయ్య దగ్గరికి చేరుస్తావు అని అడుగుతుంది నర్మదా. నా తంటాలు నేను పడతాను అని నగలను తీసుకొని తిరుపతి దగ్గరకు వెళుతుంది.. తిరుపతి మొదట ఇలాంటి పెద్ద సాహసం నేను చేయను నా మీద తప్పు నిందపడుతుంది అని అంటాడు. శ్రీవల్లి మాత్రం కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళ వేళ్ళ పడి మరి తిరుపతిని ఒప్పిస్తుంది.. ఇక రామరాజు రాగానే తిరుపతి శ్రీవల్లి ఆ నగలను ఇవ్వాలని అనుకుంటారు. రామరాజు వచ్చి ఇంట్లో కూర్చోగానే తిరుపతి నగలను తీసుకొని వస్తాడు. బావ ఇదిగో నగలని అంటాడు. ఏ నగలు ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అంటాడు. ఏం నగలు అంటావేంటి ప్రేమ నగలు అని తిరుపతి అనగానే అందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Big Stories

Advertisement
×