E-Paper
Advertisement

Top 20 News Today: సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు, జగన్‌పై ఐపీఎస్ ఏబీ ఫైర్ 

Top 20 News Today: సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు, జగన్‌పై ఐపీఎస్ ఏబీ ఫైర్ 
Advertisement

1. సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

సికింద్రాబాద్ కార్పొరేషన్, జిల్లా ఏర్పాటు డిమాండ్‌తో జరిగిన నిరసనలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయ్యా జాగీరులా ప్రవర్తిస్తే ముక్కలు చేసేందుకు కూడా వెనకాడం అంటూ హెచ్చరించారు. తాము చట్టప్రకారమే ముందుకు వెళ్తామని, సికింద్రాబాద్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి తీరును వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

2. వాట్సాప్ స్టేటస్ కలకలం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన వాట్సాప్ స్టేటస్ నియోజకవర్గంలో కలకలం రేపింది. పేకాట శిబిరాలు కుటీర పరిశ్రమగా మారాయంటూ ఆయన ఒక వీడియోను షేర్ చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు దాడులు నిర్వహించి, పలువురిని అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

3. ట్రాఫిక్ జామ్

Advertisement

వనదేవతల దర్శనం కోసం భక్తులు మేడారానికి భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒక్కరోజే సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తాడ్వాయి వద్ద రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీ దృష్ట్యా, గద్దెల బయటి నుండే దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

4. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత

నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కండలేరు జలాశయం పరిశీలనకు బయలుదేరిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ శ్రేణులను పోలీసులు.. కండలేరు డ్యామ్ ముఖద్వారం వద్ద అడ్డుకున్నారు. డ్యామ్ పరిశీలనకు కేవలం 20 మందికే అనుమతి ఉందని పోలీసులు తెలపడంతో.. వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. జలాశయాన్ని చూసేందుకు అందరికీ అనుమతి ఇవ్వాలని పట్టుబట్టారు.

5. గొర్రెల మంద వివాదం

Advertisement

కర్నూలు జిల్లా హాలహర్విలో గొర్రెలు, మేకలు ఒకరి మందలో మరొకరివి కలిశాయనే వివాదం ఘర్షణకు దారితీసింది. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఈ గొడవలో నాగప్ప అనే వ్యక్తి కత్తితో పొడవడంతో గాదిలింగప్పకు తీవ్ర గాయాలయ్యాయి. తోపులాటలో మరో ఇద్దరు గాయపడగా, వారిని ఆలూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గాదిలింగప్పను మెరుగైన వైద్యం కోసం అదోనికి తరలించారు.

6. ఆత్మహత్యాయత్నం

మచిలీపట్నంలో వైన్ షాప్ యాజమాన్యం విషయంలో వైసిపి మాజీ కౌన్సిలర్ కోసూరు నాంచారయ్య, లైసెన్స్ హోల్డర్ పసుపులేటి అనిల్ మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. నాంచారయ్య తన అనుచరులతో కలిసి అనిల్, అతని సోదరుడిపై దాడి చేయగా, గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం నాంచారయ్య ఆత్మహత్యాయత్నం చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

7. మంత్రి కామెంట్స్

నెల్లూరు నగరంలోని 28వ డివిజన్‌లో గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. నగరంలో 50 వేల మొక్కలు నాటడమే లక్ష్యమని, చండీగఢ్ తరహాలో పచ్చదనాన్ని పెంపొందించాలని సీఎం సూచించారని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి నగరానికి ORR అవసరం లేదని స్పష్టం చేశారు.

8. భక్తుల కోలాహలం

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో సాధారణ భక్తులతో పాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలధారులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు నిండిపోయి భక్తులు ఆలయం బయట వరకు బారులు తీరారు. ప్రస్తుతం ఉచిత దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

9. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ..

నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో కడెం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎస్సై సాయికిరణ్, సర్పంచ్ విజయ్ కుమార్ ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసికోల్లాసానికి దోహదపడతాయని వారు పేర్కొన్నారు. యువత గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

10. ఉచిత మెగా వైద్యం

నిర్మల్ జిల్లా కడెంలోని గణేష్ మెడికల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ న్యూరో ఆసుపత్రి నిర్మల్ వైద్యుల ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులను అందజేశారు.

11. జగన్‌పై ఐపీఎస్ ఏబీ ఫైర్

గుంటూరు జిల్లా మందడంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు మాజీ సీఎం జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. జగన్ ప్రవర్తనను సైకోటిక్ డిజార్డర్‌గా అభివర్ణిస్తూ, అమరావతిపై ఆయనకు మొదటి నుంచీ చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రైతులపై దౌర్జన్యాలు చేసిన వారిపై ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకాడుతోందని, ఇది ప్రభుత్వ పిరికితనమేనని ఆయన వ్యాఖ్యానించారు.

12. పట్టాల పంపిణీ

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. రామగుండం కార్పొరేషన్‌లో రూ.175 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 576 ఓపెన్ ప్లాట్ల పట్టాలు, 633 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 479 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను లబ్ధిదారులకు అందజేశారు.

13. బాలుడు అదృశ్యం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో మూడేళ్ల బాలుడు అశ్విన్ అదృశ్యం కావడం కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు అనిల్, చంద్రికలు తమ కుమారుడి కోసం పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సీఐ నైలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

14. సంక్రాంతి సంబరాలు

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనకు తగ్గట్లుగా సాంప్రదాయ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశామని ZPTC జయప్రకాష్ నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన కబడ్డీ టీమ్‌లతో.. వీరవాసరంలో కబడ్డీ పోటీలు నిర్వహించామన్నారు.

16. హైందవ సంస్కృతి

హైదరాబాద్‌లో అఖండ–2′ చిత్రాన్ని చినజీయర్ స్వామివారు, అహోబిలం స్వామివారు వేద పాఠశాల విద్యార్థులతో కలిసి వీక్షించారు. సనాతన ధర్మాన్ని ఎంతో బాధ్యతగా, బలంగా ప్రజలకు అర్థమయ్యేలా చూపించారని దర్శకుడు బోయపాటి శ్రీనును స్వామివారు ప్రశంసించి ఆశీర్వదించారు. బాలకృష్ణ నటన, చిత్ర నేపథ్యం హైందవ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయని కొనియాడారు

17. అధ్యక్షుగు ట్రంప్ హింట్

ఇరాన్ నిరసనల విషయంలో అమెరికా జోక్యం చేసుకోనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్‌లో శనివారం కీలక పోస్టు చేశారు. ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోందన, సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడులు చేయొచ్చనే నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

18. ఎల్లో అలర్ట్ జారీ

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 4.8°C కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సౌత్ ఢిల్లీలోని అయానగర్‌లో అత్యల్పంగా 2.9°C నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో జనజీవనం స్తంభించిపోయింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 16°C మించకపోవచ్చని అంచనా వేసిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

19. టీమ్‌ఇండియా సిద్ధం

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. అయితే.. ఈ సిరీస్‌కు రిషభ్‌ పంత్‌ దూరమయ్యాడు. అతడి స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ జట్టులోకి వచ్చాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ఆకట్టుకోవడంతో జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆదివారం అతడు జట్టులో చేరాడు.

20. ఓ వీడియో విడుదల

శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా ఈనెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆత్రేయపురంలో మూవీ యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×