E-Paper
Advertisement

Top 20 News: డంపింగ్ యార్డ్ వల్ల గోదావరి తీరం పాడవుతుంది…మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది: మల్లారెడ్డి

Top 20 News: డంపింగ్ యార్డ్ వల్ల గోదావరి తీరం పాడవుతుంది…మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది: మల్లారెడ్డి

1. రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ చర్చలు

రాజధాని రైతుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించింది త్రిసభ్య కమిటీ. రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతు కమిటీ సభ్యులు, సీఆర్డీఏ అధికారులతో త్రిసభ్య కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. రైతు సమస్యలపై చర్చించనున్నారు. సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్, మంత్రి నారాయణ, కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

2. రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

HILT స్కాంను సాక్ష్యాధారాలతో నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే, చర్చకు సిద్ధమై సబ్ కమిటీ మంత్రులతో సహా అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్‌కు అవగాహన లేదని విమర్శించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

3. రోడ్డు ప్రమాదంలో వాటర్ మ్యాన్ మృతి

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గ్రామ పంచాయతీలో వాటర్ మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న కుంటయ్య నీళ్ల వదలడానికి సైకిల్ పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

4. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది: మల్లారెడ్డి

మేడ్చెల్ జిల్లా పీర్జాదిగుడా కార్పొరేషన్‌లో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొని అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు బంద్ అయ్యాయని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

5. సర్పంచ్ స్థానాం కోసం హడావుడిగా పెళ్లి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అవివాహితుడైన ముచ్చె శంకర్, నల్గొండ మహిళను హడావుడిగా పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు ఓటర్ జాబితాలో చేర్చాలన్నది ఆయన ప్లాన్. కానీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా దరఖాస్తు ఆలస్యం కావడంతో ఆమె పేరు నమోదు కాలేదు. తాను అనుకున్నది ఒక్కటి అయితే ఇక్కడ జరిగిందొక్కటిగా మారిందన్నాడు.

6. డంపింగ్ యార్డ్ వల్ల గోదావరి తీరం పాడవుతుంది

జగిత్యాల జిల్లా ధర్మపురిలో మార్నింగ్ వాక్ సందర్భంగా గోదావరి తీరాన్ని పరిశీలించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. డంపింగ్ యార్డ్ వల్ల భక్తులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి గుర్తించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.

7. 10 కోట్ల స్కాం వెలుగులోకి వచ్చింది

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో రూ. 10 కోట్ల భారీ స్కాం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఈవో రమేష్ బాబు, రైతులకు నకిలీ డిపాజిట్ పత్రాలు ఇచ్చి ఈ మొత్తాన్ని స్వాహా చేసినట్లు రైతులు తెలిపారు. రైతులు ఫిర్యాదు చేయగా, బ్యాంకు అధికారులు ఎంక్వయిరీ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదైనట్లు సమాచారం.

8. రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం

అమరావతిలోని రాయపూడి సీఆర్‌డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సీఆర్‌డీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, కలెక్టర్ తమీమ్ అన్సారియా, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

9. పంచాయతీ నామినేషన్ ఫీజుగా నాణాలతో చెల్లింపు

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన యువకుడు జంగిలి మహేందర్ సర్పంచ్ పదవికి నామినేషన్ ఫీజును వెయ్యి రూపాయల నాణేలు చెల్లించి వినూత్నంగా దాఖలు చేశాడు. అందరికీ రూపాయి విలువ తెలియాలనే ఉద్దేశంతో నాణేలతో రుసుం చెల్లించినట్లు పేర్కొన్నాడు. గతంలో వార్డు మెంబర్ కు పోటీ చేసి, ఒక ఓటు తేడాతో ఓడిపోవండతో ఈ విధంగా చేసినట్లు తెలిపాడు మహేందర్.

10. బైక్ ర్యాలీలో పాల్గొన్న హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి

సిద్దిపేటలో దీక్షా దివస్ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల విగ్రహాలకు నివాళులు అర్పించారు.

11. ఎమ్మెల్యే సీతక్క కేసు నేడు విచారణ

కోవిడ్-19 సమయంలో ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసినందుకు అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే సీతక్కపై కేసీఆర్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణ నేపథ్యంలోనే నేడు ఆమె నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకానున్నారు.

12. మంత్రి పీఏ సతీష్‌ లైంగిక వేధింపుల కేసులో గందరగోళం

పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి పీఏ సతీష్‌పై లైంగిక వేధింపుల కేసులో గందరగోళం నెలకొంది. బాధితురాలికి మెడికల్ టెస్టులు నిర్వహించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సతీష్ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు వాట్సాప్ చాటింగ్‌ను విచారించనున్నారు.

13. మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం గందరగోళం

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం జరిగిన సమావేశం గందరగోళంగా మారింది. వర్గాల వారీగా చీలిపోయిన నేతలు తమకే అవకాశమివ్వాలని పట్టుబట్టడంతో, అబ్జర్వర్‌లు నచ్చజెప్పినా ఫలితం లేక సమావేశం వాయిదా పడింది.

14. కర్ణాటక సీఎం పదవిపై రగడ

కర్ణాటకలో సీఎం పదవిపై రగడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌ భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇరువురు నేతలు బ్రేక్‌ఫాస్ట్‌కు సమావేశమయ్యారు.

15. సెంచరీ రికార్డు సాధించిన యంగ్ క్రికెటర్ ఆయుశ్ మాత్రే

వరల్డ్ డొమెస్టిక్ క్రికెట్ లో 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్ గా ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రే రికార్డు నెలకొల్పారు. నిన్న smatలో విదర్భపై 53 బంతుల్లోనే 110య రన్స్ సాధించి ఈ ఘటతను అందుకున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. తర్వాతి స్థానంలో ఉన్నుక్త్ చంద్, డికాక్, అహ్మద్ షెహజాద్ ఉన్నారు.

17. భారత సైనిక ఒప్పందాన్ని ఆమోదించిన రష్యా

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ మరికొన్ని రోజుల్లో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు ముందు మాస్కో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ తో చేసుకున్న సైనిక బప్పందాన్ని ఆ దేశ పార్లమెంట్ లో ఆమోదించనున్నటు తెలుస్తోంది. అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించనున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

18. ఇఫి వేడుకల్లో లాల్‌ సలాం

ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన చిత్రం లాల్‌ సలాం. ఈ సినిమాలో రజనీకాంత్‌ ఓ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ మూవీని ఇఫి వేడుకల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా విషయంలో తన తండ్రికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.

19. భారత్‌, శ్రీలంక టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ ఖరారైంది

భారత్‌, శ్రీలంక మహిళల జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ ఖరారైంది. విశాఖపట్నం, తిరువనంతపురంలో వచ్చే నెల 21 నుంచి 30 వరకు సిరీస్‌ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌ రద్దయింది. దీంతో బీసీసీఐ లంకతో సిరీస్‌ను ఏర్పాటు చేసింది.

20. కార్తీ కొత్త సినిమా “అన్నగారు వస్తారు‌గా”

హీరో కార్తీ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్‌టైనర్ వా వాతియార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తెలుగులో ‘అన్నగారు వస్తారు‌గా ప్రేక్షకుల ముందు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. టీజర్‌లో కార్తీ పోలీస్ ఆఫీసర్‌ రోల్‌లో కనిపిచాడు. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×