ఏపీ జిల్లాల పునర్విభజనలో భాగంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనిపై రంపచోడవరం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంపచోదవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిపింది గత ప్రభుత్వం. దీంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం పోలవరం ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జంట హత్యల కేసులో వీరికి కేటాయించిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కోర్టులో లొంగిపోవడానికి పిన్నెల్లి సోదరులకు రెండు వారాల గడువు ఇచ్చింది. ‘161’ స్టేట్‌మెంట్‌లు మీ దగ్గరకు ఎలా వచ్చాయి? ఇది విచారణలో జోక్యం’ అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ హోంమంత్రి అనిత వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ మహిళ నిరసన చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన గొంతులో ప్రాణం ఉండగా భూమి ఇవ్వనని మహిళ తెలిపారు. కక్షపూరితంగా తన ల్యాబ్‌ను సీజ్ చేశారని రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా కొలుకులలో బత్తుల కుటుంబానికి చెందిన శివ గంగురాజు, నందినిల పెళ్లి వింత ఆచారంతో జరిగింది. వరుడు పట్టుచీరతో వధువులా, వధువు తెల్ల పంచె, కుర్తాతో వరుడిలా వేషధారణ చేసుకున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం శుభాన్ని ఇస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట-విజయవాడ వెళ్తున్న సిమెంటు లారీ టైరు పగలటంతో వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరీంనగర్ కలెక్టర్‌ను కలిశారు. జమ్మికుంట మండలం తణుగుల వద్ద మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను దుండగులు బాంబులతో పేల్చారని ఆరోపించారు. ఇసుక మాఫియా ఈ పని చేసిందని, దీనిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా దొంచందా గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లండన్ నుంచి తిరిగి వచ్చిన శ్రీకాంత్.. అఖిల వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తీసిన సెల్ఫీ వీడియోలో ఆమె వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించాడు శ్రీకాంత్.
అల్లూరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని వర్తనాపల్లిలో ముందస్తు సమాచారం మేరకు సీఐ వినోద్ బాబు, ఎస్సై వీరబాబు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తరలించడానికి సిద్ధంగా ఉంచిన 760 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.80 కోట్లు ఉంటుందని అంచనా.
కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో జెప్టో, జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి ఈ-కామర్స్ వేర్‌హౌస్‌లపై దాడులు చేశారు. 75 గిడ్డంగులను సందర్శించారు. 1,903 యూనిట్ల కాలం చెల్లిన, తప్పుగా లేబుల్ చేసిన ఆహారాన్ని, 76 కిలోల కుళ్ళిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 32 మెరుగుదల నోటీసులు జారీ చేయబడ్డాయి.
అనంతపురంలో అమూల్య కుమారుడి గొంతు కోసి ఆపై ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తనకు కాల్ చేసింది అన్ని అమూల్య తండ్రి అని చెప్పారు. తాను సర్దుకొని పొమ్మన్ని చెప్పాను. మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. భర్త కొట్టాడని, అమూల్య మానసిక క్షోభకు గురైందని, చనిపోయే ముందు తండ్రికి తెలిపింది.
జేఎన్టీయూలో ఈఈఈ విద్యార్థిని దివ్య ఆత్మహత్య చేసుకోవడంతో అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. 30 శాతం హాజరు కారణంగా ప్రొఫెసర్లు డిటెన్ చేయడం వల్లే దివ్య మనస్థాపానికి గురైందని ఆరోపిస్తూ, ఏబీవీపీ, స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.
ఏలూరు శివారులోని కొముడవోలు జగనన్న హౌసింగ్ కాలనీలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లబ్ధిదారులకు అందజేయకుండా దాచి ఉంచిన సుమారు 8 కోట్ల 25 లక్షల విలువైన సామగ్రిని ఎమ్మెల్యే గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా సామగ్రిని తరలిస్తున్న హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కడపలోని మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్‌లో పూలే 135వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయుడు, ముఖ్యంగా మహిళల విద్య కోసం పోరాడిన మహానుభావుడు అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు.
మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అంబర్‌పేట్ అలీ కేఫ్ చౌరస్తా వద్ద జ్యోతిబాపులే విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమతరావు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ 2019 గ్రూప్ 2 సెలక్షన్ లిస్ట్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. నిబంధనలు పాటించిన వారు బయట ఉండగా, ఉల్లంఘించిన వారు ఉద్యోగాలలో ఉన్నారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఆరేళ్లుగా ఉద్యోగం చేస్తున్న వారిని తొలగించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. తదుపరి సుదీర్ఘ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
నటి కియారా అడ్వాణీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర జులై 15న పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ కుమార్తెకు ‘సరాయా మల్హోత్ర’ అని పేరు పెట్టినట్లు ఈ రోజు ప్రకటించారు. 2021లో వచ్చిన ‘షేర్షా’ సినిమా షూటింగ్ సమయంలో స్నేహం, ప్రేమ ఏర్పడి, 2023 ఫిబ్రవరి 7న ఈ జంట వివాహం చేసుకున్నారు.
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పుల ఘటన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేద దేశాల నుంచి అగ్రరాజ్యానికి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు. దీనిపై ఇప్పటికే అమెరికా యంత్రాంగం చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో పలు ప్రాంఛైజీలు కొత్తగా కన్పించే అవకాశముంది. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్‌ను అంతం చేయాలని కొందరు చూస్తున్నారని ఆయన తల్లి మల్లిక ఆరోపించారు. అతడిని పరిశ్రమ నుంచి పంపేందుకు కుట్ర జరుగుతోందని మీడియాతో అన్నారు మల్లిక. పృథ్వీరాజ్ ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేక, ఆన్‌లైన్ దాడులకు దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్ర నటుడు మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి అనే విషయం తెలిసిందే. కాలేజీలో తన పేరును ఒమర్ షరీఫ్‌గా చెప్పేవారట. ఒకరోజు ఐడీ కార్డు మర్చిపోవడంతో, స్నేహితుల్లో ఒకరు పొరపాటున మహమ్మద్ కుట్టిని మమ్ముట్టి అని చదివారట. అప్పటినుండి ఆ పేరే స్థిరపడిందని ఆయన చెప్పుకొచ్చారు.