E-Paper
Advertisement

Top 20 News: ప్రభుత్వ భూముల్లో విల్లాస్ కట్టి మోసం చేసారు…అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా?

Top 20 News: ప్రభుత్వ భూముల్లో విల్లాస్ కట్టి మోసం చేసారు…అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా?

  1. రాజధాని రైతుల సమస్యల పై కమిటీ: చంద్రబాబునాయుడు

రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేసినట్టు చెప్పారు సీఎం చంద్రబాబు. రైతులకు సంబంధించిన ప్రతి పనికీ.. సీఆర్డీఏ అధికారులు డబ్బు డిమాండ్ చేయడంపై విచారణ చేయిస్తున్నట్టు చెప్పారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనీ.. వచ్చే సీజన్ నాటికి అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వస్తుందని అన్నారు చంద్రబాబు.

2. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచిన పట్టించుకోవడం లేదు

కృష్ణా నీటి పంపకాలపై ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వాదిస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ స్పందించడం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ దీక్షను కొందరు మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

3. గొడవలు వద్దు, అందరు కలిసికట్టుగా ముందుకెళ్లాలి

రాంచంద్రరావు, ధర్మపురి అరవింద్ మధ్య పంచాయితీకి తెరపడింది. రామచంద్రరావు ఇంట్లోనే రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మధ్యవర్తిత్వంలో ఈ పంచాయితీ జరిగినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా రామచంద్రరావు‌ను టార్టెట్‌ చేస్తూ ధర్మపురి కామెంట్ చేశారు. తనపై కంప్లయింట్లు ఇవ్వడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు అరవింద్. ఇలాంటి వాటికీ చెక్ పెడుతూ.. అందరూ కలసికట్టుగా ముందుకెళ్లాలని లక్ష్మణ్ ఇరువురికి సూచించినట్టు సమాచారం.

4. ప్రభుత్వ భూముల్లో విల్లాస్ కట్టి మోసం చేసారు

సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలోని.. రెయిన్‌బో మెడోస్ కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు భూమిగా చెప్పి ప్రభుత్వ భూముల్లో విల్లాస్ కట్టి రెయిన్‌బో సంస్థ నిర్వాహకులు తమను మోసం చేశారంటూ ఆందోళన చేశారు. 198, 199, 204, 208, 210 సర్వే నంబర్లలో ఈడీ సర్వే చేసి 40 విల్లాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని గుర్తించడంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.

5. రోడ్డు నిర్మించకపోతే పంచాయతీ ఎలెక్షన్లు బహిష్కరిస్తాం

గ్రామ పంచాయితీ ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఖమ్మం జిల్లాలోని అనంతారం, రేగుల తండా గ్రామస్తులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. రేగుల తండా సమీపంలో రోడ్డు నిర్మాణం కోసం ఆ గ్రామస్తులు ధర్నాకు దిగారు. అనంతారం రైల్వే గేట్ నుంచి రేగుల తండాకు కిలోమీటర్ దూరం బీటీ రోడ్డు నిర్మించాలని, ఈ రోడ్డు నిర్మించకుంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.

6.  కోనసీమ జిల్లా పీచు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గొల్లపాలెం ONGC GGS ప్రక్కన పీచు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ONGC ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపు చేస్తున్నారు ONGC ఫైర్ సిబ్బంది.

7.  అధికారుల అక్రమ వసూళ్లను నిలిపి వేయాలని గ్రానైట్ యజమానులు, కార్మికులు ఆందోళన

బాపట్ల జిల్లా వేమవరం గ్రామంలో ఏఎంఆర్ చెక్‌పోస్ట్‌ల అధికారుల అక్రమ వసూళ్లను నిలిపి వేయాలని గ్రానైట్ యజమానులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. రెండు AMR చెక్‌పోస్టులను ధ్వసం చేశారు గ్రానైట్ కార్మికులు. గత 20 రోజుల నుంచి గ్రామాల్లోని రహదారుల వెంబడి AMR చెకోపోస్టులు ఏర్పాటు చేసి గ్రానైట్ లారీల నుంచి.. నగదు వసూలు చేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

8. కంటైనర్‌ వాహనంలో అగ్నిప్రమాదం

ఒడిశాలో కంటైనర్‌ వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గంజాం జిల్లా, కొనిసి జాతీయ రహదారి-16పై ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రా నుండి ఒడిశా వెళ్తున్న కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌, క్లీనర్‌ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

9. అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా?

రాజధాని అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తోందేమోనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. గతంలో 54 వేల ఎకరాలు సేకరించినా అభివృద్ధి లేదని, ఇప్పుడు మళ్లీ 16 వేల ఎకరాల రెండో దశ భూసేకరణ ఎవరి ప్రయోజనాల కోసం అని చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ సహా ఇతర ప్రాజెక్టులకు వేల ఎకరాల అవసరం ఏంటని ప్రశ్నించారు.

10. ఏకగ్రీవంగా ఎన్నికైన అడిచర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం పరిధిలోని చిన్నఅడిచర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పందుల వెంకటయ్య గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి గాను వెంకటయ్య కొంత సొంత డబ్బులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

11. జూనియర్లను గోడ కుర్చీ వేయించి సీనియర్లు ర్యాగింగ్

నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో జూనియర్లను గోడ కుర్చీ వేయించి సీనియర్లు ర్యాగింగ్ చేశారు. యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు అందగా.. విచారణ జరిపిన ప్రిన్సిపల్ నలుగురు విద్యార్థులు దీపక్ శర్మ, హేమంత్, కిషన్, అలోక్ లను రెండు నెలలు కాలేజీ నుంచి, సంవత్సరం హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు.

12. జడ్చెర్లలో హాస్పిటల్ ను ప్రారంభించిన ఆలీ

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రం నూతనంగా ఏర్పాటు చేసిన ఆశ హాస్పిటల్‌ను సినీ నటుడు అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీతో ఫోటోలు దిగడం కోసం అభిమానులు ఎగబడ్డారు. సరదగా కొందరికి సెల్ఫీలు ఇచ్చారు అలీ.

13. సీఎం చంద్రబాబు, ప్రజల ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయ్యాను:  కొలికపూడి శ్రీనివాసరావు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో, ప్రజల ఆదరణతో తాను ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు. తన పని నచ్చని కొందరు నేతలు సర్పంచ్‌ల మాదిరిగా తనను కూర్చోబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారి ఆటలు సాగవని హెచ్చరించారు శ్రీనివాసరావు.

14. పేదల ఆరోగ్యం కాపాడేందుకు మేము ముందు ఉంటాం: తంగిరాల సౌమ్య

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. 67 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.34,34,792 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు ఈ నిధిని విడుదల చేస్తున్నారని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నందిగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు 3.5 కోట్ల CMRF చెక్కులు పంపిణీ చేశామని వెల్లడించారు.

15.  కొండారెడ్డిపల్లిలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్

మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో మల్లెపాకుల వెంకటయ్య ఒక్కరే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.

16. భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో మానవతా సహాయం

శ్రీలంకలో ‘దిత్వా’ తుఫాను విధ్వంసం నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో మానవతా సహాయాన్ని ప్రారంభించింది. భారత వైమానిక దళం హిండన్ ఎయిర్ బేస్ నుంచి C-130, IL-76 విమానాలను మోహరించింది. ఈ విమానాల్లో 80 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు, 21 టన్నుల సహాయ సామాగ్రిని, 8 టన్నుల పరికరాలను కొలంబోకు తరలించింది.

17. తమిళనాడు తీరంలో తుఫాన్ ఎఫెక్ట్‌

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్‌తో తమిళనాడు తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురుగాలుల కారణంగా రామేశ్వరం జిల్లాలోని పంబన్ దీవి పరిసరాల్లో సముద్రం హోరెత్తుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను శ్రీలంక, ఆగ్నేయ బెంగాల్ మీదుగా ఉత్తర నైరుతి దిశగా కదులుతోంది.

18. వాట్సప్ నిషేధం విధించడానికి రష్యా చర్యలు

రష్యా చట్టాలకు అనుగుణంగా వాట్సప్ సహకరించడం లేదని ఆరోపిస్తూ, ఆ యాప్‌పై సంపూర్ణ నిషేధం విధించడానికి రష్యా చర్యలు తీసుకుంటోంది. యూజర్లు దేశీయ యాప్‌లను ఎంచుకోవాలని సూచించింది. మరోవైపు వినియోగదారుల డేటా భద్రతను ఉల్లంఘించే రష్యా ప్రయత్నాలను అడ్డుకుంటున్నందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని వాట్సప్ మాతృసంస్థ మెటా ఆరోపించింది.

19. ఇఫి వేడుకల్లో లాల్‌ సలాం

ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన చిత్రం లాల్‌ సలాం. ఈ సినిమాలో రజనీకాంత్‌ ఓ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ మూవీని ఇఫి వేడుకల్లో ప్రదర్శించారు. ఈ సినిమా విషయంలో తన తండ్రికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు ఐశ్వర్య.

20. టీమిండియాలోకి తిరిగి వస్తా: ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్‌ మాలిక్

టీమిండియాలోకి తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్‌ మాలిక్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న అతడు.. ప్రస్తుతం స్లో బాల్స్, యార్కర్లపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. వేగంగా బౌలింగ్ చేయాలంటే.. ధైర్యం ఉండాలని.. ఇప్పటివరకు 10 వన్డేలు, 8 టీ20ల్లో టీమ్ ఇండియా తరఫున 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఉమ్రాన్ మాలిక్.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×