E-Paper
Advertisement

Kakinada News: కాకినాడ జిల్లాలో దారుణం.. కాలిలో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన వైద్యులు!

Kakinada News: కాకినాడ జిల్లాలో దారుణం.. కాలిలో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన వైద్యులు!
Advertisement

Kakinada News: తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అత్యంత నిర్లక్ష్యకర సంఘటన చోటు చేసుకుంది. సర్జరీ చేయించుకునేందుకు వచ్చిన యువకుడి కాలిలో వైద్యులు ఏకంగా సర్జికల్ బ్లేడు మర్చిపోయి కుట్లు వేశారు. ఆపరేషన్ అనంతరం విపరీతమైన నొప్పి రావటంతో ఎక్స్-రే తీయించగా, ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే మరోసారి సర్జరీ చేసి ఆ బ్లేడును తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు.

ఈ ఘటన తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ, రామకృష్ణ నగర్ ప్రాంతానికి చెందిన కొప్పిరెడ్డి చిన్న అనే యువకుడి విషయంలో జరిగింది. సుమారు రెండేళ్ల క్రితం ఒక ప్రమాదంలో చిన్నా కాలికి గాయమైంది. ఆ సమయంలో విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అతడు కాలికి సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీలో వేసిన ప్లేట్లకు సంబంధించిన బోల్ట్‌ను తీసివేయాలని అప్పటి వైద్యులు చిన్నకు సూచించారు. వైద్యుల సలహా మేరకు చిన్న రెండు రోజుల క్రితం తుని ఏరియా ఆసుపత్రిలో కాలికి సర్జరీ చేయించుకునేందుకు వచ్చాడు. వాస్తవానికి, తుని ఏరియా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ మహేష్ కుమార్ పని చేసేవారు. అయితే, ఆయన పదోన్నతి పొంది కాకినాడ వెళ్లారు. ఆయన స్థానంలో ప్రత్తిపాడు నుంచి వచ్చిన ఆర్థోపెడిక్ సర్జన్ ఆధ్వర్యంలో చిన్నకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ పూర్తయ్యాక, చిన్నాను వైద్య సిబ్బంది వార్డుకు తరలించారు.

Advertisement

వార్డుకు తరలించిన కొద్దిసేపటికే చిన్నకు కాలిలో తీవ్రమైన నొప్పి మొదలైంది. నొప్పి తట్టుకోలేక అతను ఆసుపత్రి సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. పరిస్థితి చూసిన వైద్యులు వెంటనే కాలికి మళ్లీ ఎక్స్-రే తీయించాలని సూచించారు. ఎక్స్-రే రిపోర్ట్ చూసిన సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ రిపోర్ట్‌లో కాలి లోపల స్పష్టంగా ఒక సర్జికల్ బ్లేడ్ కనిపించింది. సర్జరీ చేసిన వైద్యులు అత్యంత నిర్లక్ష్యంగా ఆ బ్లేడును కాలి లోపల మర్చిపోయి కుట్లు వేశారనే విషయం అర్థమైంది. ఈ విషయం వెంటనే సీనియర్ వైద్యుల దృష్టికి వెళ్ళింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, చిన్నకు మరోసారి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అత్యవసరంగా మరో సర్జరీ నిర్వహించి, కాలి లోపల ఉన్న బ్లేడును వైద్యులు విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం చిన్నా తుని ఏరియా ఆసుపత్రిలోని సర్జికల్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.

ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తుని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణ ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామన్నారు. ఆపరేషన్‌లో పాలుపంచుకున్న సంబంధిత వైద్యులు సిబ్బందిని విచారిస్తున్నట్లు ఆమె తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

ALSO READ: Top 20 News: ప్రభుత్వ భూముల్లో విల్లాస్ కట్టి మోసం చేసారు…అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా?

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×