మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు పట్టాభిపురం వంతెన వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి మంత్రులు చేరుకున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్‌లు.. మేడారం అభిశృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు.
ఢిల్లీ పేలుడు ఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. పేలుళ్లకు, బీజేపీకి సంబంధం ఉందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీహార్ ఎన్నికలకు కొన్ని గంటల ముందే ఢిల్లీలో పేలుడు జరిగిందన్నారు. ఓ వర్గానికి సంబంధించిన డాక్టర్లు కుట్ర పన్నితే.. వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అలజడి సృష్టించాలని చేసిన కుట్రగా అభివర్ణించారు ఎంపీ.
ఎంప్లాయిమెంట్ కల్పించే స్థాయిలో మన కాలేజీల్లో ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నామన్నారు మంత్రి నారా లోకేశ్. గుంటూరు జిల్లా ఐనవోలులో CII-SR హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఇండియాలో కేవలం 51 శాతం మంది పట్టభద్రులకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని ఆరోపించారు. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులకు తగ్గట్టుగా మనం ఛేంజ్‌లు చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
రైల్వే కోడూరు సుధా మాధురి, వేమన సతీష్ మధ్య టికెట్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. మాధురి దగ్గర వేమన సతీష్ 7 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు జైభీమ్ రావ్ భారత్ పార్టీ నేత జడ శ్రావణ్ కుమార్. తన దగ్గర వాటికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయన్నారు. ఇలాంటి వాటిని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం ఆగదన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేశారు. పేదవాళ్లకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర చంద్రబాబు చేస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల PPP విధానానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. అలిపిరి కేంద్రంలో సిట్ కార్యాలయానికి బోలెబాబా డైరెక్టర్లు ఇద్దరూ హాజరయ్యారు. కల్తీ నెయ్యి జరిగిన సమయంలో టీటీడీలో ఈవోగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డిని మరోసారి విచారణకు పిలిచి సిట్ ప్రశ్నిస్తోంది.
సమయ పాలన పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నాంపల్లి చేనేత భవన్‌లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటల వరకు విధులకు హాజరుకాని కొందరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం మథరసాలో ముగ్గురు బాలికలు అదృశ్యం అయ్యారు. ముగ్గురు బాలికల్లో ఒకరిది విజయవాడ, మరొకరిది కాకినాడ, ఇంకొకరిది బంటుమిల్లి. పెడన 15వ వార్డులో ఉన్న మర్కజ్ దారుల్ బీర్ మథరసాలో.. ఒకేషనల్ కోర్సులో జాయిన్ అయ్యారు. సదరు బాలికల నడవడికలో మార్పులను గమనించారు తోటి బాలికలు. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లే లోపు వారు ఆదృశ్యం అయ్యారు. బాలికల మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మైనర్ బాలికలు కాకినాడ చేరుకున్నట్లు గుర్తించారు.
కొత్తపేట సబ్‌స్టేషన్ విద్యుత్ సిబ్బందిపై చైతన్యపురి పోలీసులు అత్యుత్సహం చూపారు. గంజాయి కేసులో సాక్ష్యం కోసం విద్యుత్ సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చి, భౌతిక దాడులకు పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. దీంతో విద్యుత్ ఉద్యోగ సంఘాలు సబ్ స్టేషన్ ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. పోలీసుల వైఖరిపై విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వీఐటీ-ఏపీ యూనివర్సిటీలో జరిగిన సీఐఐ-ఎస్ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులతో ఫోటోలు దిగి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
నిర్లక్ష్యమైన వైద్యంతో ఓ యువకుడు మంచం పట్టాడు. కరీంనగర్ జిల్లాలోని భగత్‌నగర్‌కు చెందిన రమణ అనే వ్యక్తి నార్మల్‌గా చెక్ చేయించుకుందామని ఆస్పత్రికి వెళ్ళాడు బిపి అధికంగా ఉందంటూ డాక్టర్ వేశారు. దీంతో అప్పుడే నోటిమాట పడిపోయింది. నిర్లక్ష్యంగా వైద్యం చేశారని బాధితుడు ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.
బీజేపీ ఎంఎల్సీ సోము వీర్రాజు ఈరోజు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో ఆయనను సత్కరించి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దుర్ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పేలుడు సమయంలో కారులో ఉమర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో… ఈ ఘటనలో అతను చనిపోయాడా లేదా అనేది తెలుసుకునేందుకు… అతని కుటుంబసభ్యుల డీఎన్‌ఏను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. డీఎన్ఏ మ్యాచ్ అయితే… అతను కూడా చనిపోయినట్లు ప్రకటించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ విద్యార్థి సృజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సృజన్ EEE బ్రాంచ్‌లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి స్వగ్రామం గుంటూరు జిల్లా.
ఉగ్రవాద ఆరోపణలతో గుజరాత్ ATS అరెస్టు చేసిన మొహియుద్దీన్.. అమాయకుడు అంటున్నాడు ఆయన తమ్ముడు ఒమర్ ఫారూఖీ. మొహియుద్దీన్‌ను ఎవరో ట్రాప్ చేసి ఇరికించారని అన్నాడు. ఇంటికి పోలీసులు వచ్చి ఆయన వాడిన సామాన్లను సీజ్ చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. ఏ మతమూ కూడా తీవ్రవాదం ప్రోత్సహించాలని అనుకోదని అన్నారు.
కెనడియన్-హంగరియన్-బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ గెలుపొందారు. ఆయన రచించిన ‘ఫ్లెష్’ నవలకు గానూ ఈ అవార్డు దక్కింది. భారత రచయిత్రి కిరణ్ దేశాయ్ నవల ‘ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ నవలను వెనక్కినెట్టి ఈ పోటీలో ఆయన విజయం సాధించారు. 51 ఏళ్ల డేవిడ్ సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించారు.
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ CSK జట్టుకు కీలక సూచనలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ నుంచి నితీశ్ రాణ, కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి వెంకటేష్ అయ్యర్‌ను తీసుకోవాలని సూచించాడు. వారు మూడో స్థానంలో బ్యాటర్‌గా చక్కగా సరిపోతారని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కీలక సూచనలు
ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ‘చెవాలియర్’ అవార్డుకు ఎంపికయ్యారు. చెన్నైలోని ఫ్రెంచ్ కాన్సులేట్‌లో రేపు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ‘నాయకుడు’, ‘భారతీయుడు’ వంటి చిత్రాలకు రెండు జాతీయ అవార్డులు అందుకున్న ఆయన సెట్స్ రూపకల్పనలో ప్రత్యేక శైలిని కలిగి ఉంటారు. గతంలో కమల్ హాసన్, ఐశ్వర్యా రాయ్ వంటి ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు.