నేడు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాలతో పాటు, రాష్ట్ర ఆర్థిక, పాలనాపరమైన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీల అమలు పురోగతిపై కేబినెట్ కూలంకషంగా సమీక్ష నిర్వహించనుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రోజులుగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్వెటర్లు రగ్గుల దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు తెలిపారు. ఎలాంటి పనులు ఉన్న ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం ఐదు గంటల లోపు ముగించుకోవాలని సూచిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కలెక్టర్ జితేష్ పాటిల్ పర్యటించి సీతారామ ఆలయాన్ని పరిశీలించారు. సీతారామచంద్రస్వామి పేరుతో ఉన్న అచ్చుతో మట్టి ఇటుకలు తయారు చేయించేల ప్రోత్సాహం అందించాలని రామాలయ సిబ్బందికి సూచించారు. రామ భక్తులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ కోరారు.
గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు వైఫల్యాలు భక్తుల హృదయాలను దెబ్బతీశాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుమల పవిత్రతను కలుషితం చేసిన వ్యవహారాలు ప్రస్తుత బోర్డుకు ఒక పాఠం అని, భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రస్తుత బోర్డు కృషి చేయాలన్నారు. టీటీడీలో పనిచేసేవారు హోదాలో కాకుండా.. భక్తులకు సేవ చేసే అవకాశంగా భావించాలని ట్విట్టర్ వేదికగా సూచించారు.
దేశంలోనే అతిపెద్ద మల్టీలేయర్ పీసీబీ యూనిట్ ఏపీలో పెట్టుబడి పెట్టనుందని ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. సిర్మా ఎస్‌జీఎస్ సంస్థ నాయుడుపేట వద్ద ప్లాంటు ఏర్పాటు చేయనుందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో 2,170 అధిక నైపుణ్య ఉద్యోగాలు లభించనున్నాయి. ఏపీలో బలమైన ఎలక్ట్రానిక్స్ తయారీ ఎకోసిస్టమ్‌కు పునాది పడనుందని తెలిపారు.
పాతబస్తీ యాకుత్‌పురా.. రేతికి మసీదు సమీపంలోని షాపులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి పక్క షాపులకు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలార్పారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం పలు రాష్ట్రాలకు నూతన కో-ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. తెలంగాణ ఏఐసీసీ కో-ఇన్‌ఛార్జ్‌గా సచిన్ సావంత్ నియమితులయ్యారు. ఆయన రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్‌కు సహాయకుడిగా పనిచేయనున్నారు. ఒడిశా రాష్ట్ర కో-ఇన్‌ఛార్జ్‌గా జెట్టి కుసుమ్‌కుమార్, మధ్యప్రదేశ్ కో-ఇన్‌ఛార్జ్ బాధ్యతలను ఉషా నాయుడుకు అప్పగించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై భారీ స్థాయిలో బెట్టింగులు జరిగాయి. దాదాపు 500 కోట్ల బెట్టింగ్‌లు జరిగినట్లు తెలుస్తోంది. గెలుపుతో పాటు మెజార్టీపై కూడా బెట్టింగ్‌లు వేసినట్లు సమాచారం. బిహార్ ఎన్నికలపై కూడా బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్‌లు కాశారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నేపథ్యంలో బెట్టింగ్‌లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగం చేసింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సుదీర్ఘ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కల్తీ నెయ్యి కేసులో విచారణకు హాజరు కావాలని టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బా రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.
వేగంగా విచారణ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. టిడ్కో గృహాల వైపు వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ శివ తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీఎం చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజావేదికలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతోనూ ముచ్చటిస్తారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. విశాఖ నుంచి ఇద్దరు మహిళలను మదనపల్లి తీసుకెళ్లారు కిడ్నాపర్లు. యమున అనే మహిళ మిస్సింగ్ కేసుపై విచారణ చేపట్టడంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు అయింది. మదనపల్లి గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యంత కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీ బ్లాస్ట్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నిన్న భూటాన్ పర్యటనలో మాట్లాడిన మోడీ.. ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాద శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. దేశ భద్రతను కించపరచే కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామన్నారు.
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన భారీ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ఏజెన్సీలు ఒక్కొక్క విషయాన్ని వెలికి తీస్తున్నాయి. ఐ20 కారును నడిపిన అనుమానితుడు మొహమ్మద్ ఉమర్ నబీ ఆత్మహుతికి పాల్పడ్డాడని తొలుత భావించినప్పటికీ, ఇది ఆత్మాహుతి దాడి ఆయ్యుండదని ఇంజెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. తోటి వైద్యులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తుండడంతో భయాందోళనలో పేలుడుకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
గాజా నుంచి 11ఏళ్ల తర్వాత ఓ ఇజ్రాయెల్ సైనికుడి మృతదేహం స్వదేశానికి చేరుకుంది. శాంతి చర్చల తర్వాత లెఫ్టినెంట్ హదర్ గోల్డిన్ అనే సైనికుడి అవశేషాలను హమాస్ ఇజ్రాయెల్‌కు అప్పగించింది. అక్కడి ప్రభుత్వం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరిపింది.
టర్కీలో సైనిక విమానం కుప్పకూలింది. వైమానిక దళానికి చెందిన C-130 సైనిక కార్గో విమానం జార్జియా దేశంలో అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ విమానంలో ఫ్లైట్ సిబ్బందితో సహా మొత్తం 20 మంది టర్కీ సైనిక సిబ్బంది ఉన్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కీలక ప్రకటన చేశారు. దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వాడకాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ సేఫ్టీ ఎమెడ్మెంట్ బిల్ 2024 ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి అమల్లోకి రానుంది. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, యూట్యూబ్ తదితర మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుంది.
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా టీమిండియా, సఫారీలతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. శుభ్‌మన్ గిల్ భారత జట్టు టెస్ట్ పగ్గాలు చేజిక్కించుకున్న తర్వాత స్వదేశంలో ఇది రెండో సిరీస్.
రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలోని భారీ చిత్రం SSMB29 కోసం నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక చారిత్రక ఈవెంట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 50 వేల మందికి పైగా అభిమానులు హాజరుకానున్న ఈ ఈవెంట్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్, 100 అడుగుల భారీ స్క్రీన్‌ను సిద్ధం చేస్తున్నారు.
విజయనగరం జిల్లా వంగరలోని అరసాడ గ్రామంలో బయోగ్యాస్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు కనిగిరి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి ఒక MSME పార్కును ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ అన్నారు.